తెలంగాణ

అద్దంకికీ టికెట్‌పై భారీ నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, నవంబర్ 18: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీపై పోటీ చేసేందుకు మొన్నటి వరకు పైస్థాయలో అష్టకష్టాలు పడుతూ చివరికి ఫలితాన్ని దక్కించుకున్న అద్దంకి దయాకర్‌కు ఆదిలోనే క్యాడర్ నుండి భారీఎత్తున నిరసనల సెగలు తగులుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అద్దంకి పేరు ఖరారు కావడంతో ఆగ్రహంతో రగిలిన మండలాల నాయకత్వాలు పార్టీకి రాజీనాయాలుచేసి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆదివారం నియోజకర్గకేంద్రమైన తుంగతుర్తిలోని పార్టీ కార్యాయానికి క్యాడర్ చేరుకొని హంగామా సృష్టించారు. పార్టీ ఫ్లెక్సీలు, కుర్చీలను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాయం నుండి అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మని మొయిన్‌రోడ్డుపై ఊరేగించి చౌరస్తాలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దగ్దం చేశారు. ఈసందర్బంగా పట్టణ అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అద్దంకి దయాకర్‌పై తీవ్రస్దాయిలోవిమర్శలు గుప్పించారు. 2014లోపార్టీ నుండి పోటీచేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ పట్టణాలకే పరిమితమై ఏనాడు కూడా గ్రామాలకు రాలేదన్నారు. అధికార పార్టీ ఆగడాలతోనష్టపోతున్న కాంగ్రెస్ క్యాడర్‌ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. ముఖ్యంగా పదవుల కోసమే కార్యకర్తలను వాడుకొనడం ఆయనకు అలవాటుగా మారిందని అన్నారు.కాగా ప్రముఖ వైద్యులు వడ్డేపల్లి రవి తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 9 మండలాలలోపార్టీ కార్యాలయాలు ఏర్పాటుచేసి నీరసంతో ఉన్న క్యాడర్‌కు చేదేడువాదోడుగా నిలిచాడని పేర్కొన్నారు.కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి రవిని అధిష్ఠానం మోసం చేసిందని ఆరోపించారు. అద్దంకి అభ్యర్థిత్వాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.రవిని స్వతంత్ర అభ్యిర్దిగా పోటీలోనిలిపి గెలిపిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎల్లబోయిన శ్రీకాంత్, గుజ్జనరేందర్, కొండ రాజు, రామక్రిష్ణ, జయక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.