తెలంగాణ

నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిరుదొడ్డి: మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఒకనాటి బద్ధ శత్రువులుగా వేర్వేరు పార్టీలో పోటీలో ఉన్నారు. కాగా, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం కావడంతో ఇరువురు ఒక్కటై జనాలలోకి రావడంతో నియోజకవర్గంలో సమీకరణాలు మారుతాయని నియోజకవర్గంలోని నాయకులు పేర్కొంటున్నారు. దొమ్మాట (దుబ్బాక) 2004 ఎన్నికలలో టీఆర్‌ఎస్ ఆభ్యర్థిగా సోలిపేట రాంలింగారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి పోటీచేయగా స్వల్పమేజార్టీతో రాంలింగారెడ్డి గెలుపొందారు. పునర్విభజనలో దొమ్మాటకు బదులుగా దుబ్బాక నియోజకవర్గంగా మారింది. 2009 ఎన్నికలలో టీడీపీ, టీఆర్‌ఎస్ పొత్తులో భాగంగా సిట్టింగ్ సీటు కావడంతో టీఆర్‌ఎస్‌కు కేటాయించారు. దీంతో చెరుకుముత్యంరెడ్డి టిడిపికి రాజీనామా చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్ అభ్యర్థి రాంలింగారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి చెరుకుముత్యంరెడ్డి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. దుబ్బాకను టీజేఎస్‌కు కేటాయించడంతో ముత్యంరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఒకనాటి ప్రత్యర్థు లు నేడు ఒకపార్టీలో వుండటంతో సమీకరాణలు ఏవిధంగా మారుతాయో వేచిచూడాల్సిందే.