తెలంగాణ

అంబేద్కర్ సాక్షిగా ప్రాణహితను నిర్మించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, నవంబర్ 18: భారతరత్న , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆయన పేరిట కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతిని నిర్మించి తీరుతామని పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టు విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కౌటాల మండల పర్యటనలో భాగంగా ఆయన సినీనటి విజయశాంతితో కలిసి తుమ్మిడిహెట్టి ప్రాణహితను సందర్శించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, ప్రాణహితలో నాటు పడవపై ప్రయాణం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ లబ్దితో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను రీ డిజైన్ పేరుతో అటకెక్కించారని ఆరోపించారు. 38,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఓ వైపు రాజకీయ లబ్ధి, మరో వైపు కమీషన్‌లు రావని తెరపైకి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారన్నారు. 10 వేల కోట్ల రూపాయలు వెచ్చించిన తుమ్మిడిహెట్టి, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ మరో 28 కోట్లు వెచ్చిస్తే తెలంగాణ రాష్ట్రంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ దానిని కాదని, 80వేల కోట్లతో కళ్లేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారాన్ని మోపుతున్నారన్నారు. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని, గెలిచిన వెంటనే ప్రాణహిత ప్రాజెక్ట్‌ను దళితులకు ఉపయోగపడేలా నిర్మించి తీరుతామని దీనితో పాటే కేసీఆర్ పాలనలో ఆయన అవినీతిని బయటకు తీసేందుకు విచారణ జరిపిస్తామని, అది తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌తోనే బయలకు తీస్తామని పేర్కొన్నారు. విజయ శాంతి మాట్లాడుతూ కేసీఆర్ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ క్రెడిట్ దక్క కూడదు అనే ప్రాజెక్ట్‌ను రీ డిజైన్ చేశారని కాళేశ్వరంతో నిధులు దుర్వినియోగం అయిత తుమ్మిడిహెట్టితో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దీనికి ముందు మండల కేంద్రానికి హెలిక్యాప్టర్ ద్వారా చేరుకున్న భట్టి విక్రమార్క, విజయశాంతిలకు సిర్పూర్ నియోజక వర్గ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు, మాజీ జడ్పీ చైర్మన్ గణపతి, ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, నాయకులు అబ్దుల్ షకీల్, సత్యనారాయణ, తదితరుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.