తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ ప్రకటనలు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను టీవీ చానల్స్‌లో విస్తృతంగా ప్రసారం చేయడాన్ని తప్పుపట్టుతూ టీఆర్‌ఎస్ నేతలు ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆదివారం నాడిక్కడ ఎన్నికల కమిషన్ అదనపుసీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్‌ను టీఆర్‌ఎస్ నేతలు కలసి వివరాలను అందజేశారు. తెలుగుదేశం పార్టీ మహాకూటమితో కలసి పనిచేస్తున్నదని ఎన్నికల సంఘానికి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలావున్న టీడీపీ ప్రకటనలను తక్షణం ఆపాలని కోరారు. తమ ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తానని అదనపు సీఈఓ చెప్పినట్లు టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ లేనప్పటికీ ఆ ప్రభుత్వం తరుపున ప్రకటనలు జారీ చేయడాన్ని నిలిపివేయాలన్నారు. బీజేపీ నేతలు మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కార్టూన్స్ వేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ఈసీసీ దృష్టికి తీసుకువెళ్లినట్టు వారు చెప్పారు.