తెలంగాణ

సుహాసిని స్థిర, చరాస్తులివిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని అఫిడవిట్‌లో తన స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించారు. 2017-18 వార్షికాదాయం రూ.10,53,300 ఉందని, కుమారుడు శ్రీహర్ష ఆదాయం ఏడాదికి రూ.12 లక్షలని తెలిపారు.
తన భర్త వెంకట శ్రీకాంత్‌కు వార్షికాదాయం ఏదీ లేదని పేర్కొన్నారు. ఒక హ్యుండాయ్ కారు, 2222 గ్రాముల బంగారు నగలు, రూ.30 లక్షల విలువైన వజ్రాభరణాలు, రూ.4 కోట్ల 30 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు. భర్త శ్రీకాంత్‌కు రూ.65 లక్షల విలువైన స్థిరాస్తులు, కుమారుడు శ్రీహర్షకు రూ.88 లక్షల 38 వేల విలువైన స్థిరాస్తి, ఒక కోటి 2 లక్షల 60 వేల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. మిక్ ఎలక్రిక్ సంస్థలో రూ.4 లక్షల 50 వేల విలువైన పెట్టుబడులు, శ్రీ భవానీ కాస్టింగ్ లిమిటెడ్‌లో భర్త పేరిట రూ.5 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని వివరించారు. కుమారుడి పేరిట లక్షా 50 వేల విలువైన ఎస్‌బీఐ పాలసీ ఉందని తెలిపారు. తనపై ఎటువంటి కేసులూ లేవని తెలిపారు. తనకు నాంపల్లి నియోజకవర్గంలో ఓటు హక్కు ఉందని సుహాసిని పేర్కొన్నారు.