తెలంగాణ

26న ఢిల్లీలో పాత పెన్షన్ స్కీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఢిల్లీలో భారీ ఎత్తున నిర్వహించనున్న లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేయాలని నేషనల్ ముమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపిఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకు అధ్యయనం పేరిట కమిటీలను వేసి కాలయాపన చేయొద్దన్నారు.
కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎంఓపిఎస్ ఆధ్వర్యంలో ఆదివారం కేరళలోని తిరువనంతపురంలో జరిగిన సమావేశానికి స్థితప్రజ్ఞ హాజరయ్యారు. ఢిల్లీలో నిర్వహించే లాంగ్ మార్చ్‌ను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని ఉద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత కేరళ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి కమిటీల పేరిట కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నా కేంద్రంపై నెపం మోపి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను మోసం చేస్తున్నాయని స్థితప్రజ్ఞ విమర్శించారు.