రాష్ట్రీయం

మరీ ఇంత అరాచకమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 8: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో తనను కలిసేందుకు వచ్చిన ఎన్నారైలు, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీకి ఓటు వేశామన్న అక్కసుతో తమ ఇంటిని కూల్చివేశారని, నిలువ నీడలేక ఇద్దరు బిడ్డలతో గొర్రెల పాకలో తలదాచుకునే దుస్థితి కల్పించారంటూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన శ్రీహరి, రమాదేవి దంపతులు చంద్రబాబు వద్ద కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తక్షణం 50 వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు నివశించే హక్కును వైసీపీ నేతలు కాలరాస్తున్నారని విమర్శించారు. స్వేచ్ఛగా జీవించడం, ఆస్తులు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. రోడ్లకు అడ్డంగా గోడలు కడుతున్నారని, ఉన్న ఊళ్లను ఖాళీ చేసి పోవాలని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. భూములు సాగు చేయనీయకుండా అడ్డుపడుతూ ఉన్న ఇళ్లను కూల్చి వేస్తున్నారని, గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో వైసీపీ నేతల బీభత్సం అధికమైందని, అరాచకాలు శృతిమించాయని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ ప్రతినిధి బృందం శుక్రవారం గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో పర్యటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
కియాతో కరువు సీమలో ఉపాధి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కియా కార్ల కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చి కరువు సీమ అనంతపురంలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం తొలికారును విడుదల చేస్తున్న సందర్భంగా కియా సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ కియాను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చేందుకు పట్టుదలతో కృషిచేశామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కియా పరిశ్రమ మరింతగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కియాతో పాటు హీరో మోటోకార్ప్, అశోక్ లేల్యాండ్, అపోలో టైర్స్ వంటి అనేక కంపెనీల రాకతో ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా రూపొందాలన్న ఆకాంక్షను బాబు వ్యక్తంచేశారు.