బిజినెస్

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాభాల్లో సెన్‌సెక్స్, నష్టాల్లో నిఫ్టీ
ముంబయి, నవంబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసిక జిడిపి గణాంకాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య సమీక్షకు ముందు మదుపరులు పెట్టుబడులపై డోలాయమానంలో పడ్డారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ లాభాల్లో ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ నష్టాల్లో ముగిసింది. సెన్‌సెక్స్ 17.47 పాయింట్లు పెరిగి 26,145.67 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7.45 పాయింట్లు కోల్పోయి 7,935.25 వద్ద నిలిచింది. ఇదిలావుంటే ఐటి, కన్జ్యూమర్ డ్యూరబుల్, రియల్టీ, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ 1.07 శాతం నుంచి 0.58 శాతం పెరిగింది. అయితే టెలికాం, ఎఫ్‌ఎమ్‌సిజి, ఎనర్జీ, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 1.72 శాతం నుంచి 0.41 శాతం తగ్గింది. అంతర్జాతీయంగా హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.11 శాతం నుంచి 1.82 శాతం నష్టపోయాయి. షాంగై సూచీ మాత్రం 0.26 శాతం లాభపడింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు 0.44 శాతం, 0.71 శాతం చొప్పున పుంజుకున్నాయి. బ్రిటన్ సూచీ మాత్రం 0.24 శాతం పడిపోయింది.