రాష్ట్రీయం

టీచర్ల బదిలీలపై అభ్యంతరాలను సరిచేసిన పాఠశాల విద్యాశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ టీచర్ల బదిలీల్లో సాంకేతిక అంశాలతో దాదాపు 300 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వాటిలో డిఇఓల నుండే 120 వరకూ క్లయిమ్‌లు రావడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంథ్యారాణి సరిచేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలు సైతం బదిలీలపై అభ్యంతరాలు చెప్పడంతో వాటన్నింటినీ సీనియర్ అధికారులతో పరిశీలన చేయించిన డైరెక్టర్ చివరికి సవరణ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై యుటిఎఫ్ నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పించాలని, 610 జిఓ ప్రకారం మినహాయింపు పొందిన వారికి ప్రమోషన్లు ఇప్పించాలని డైరెక్టర్‌ను కోరినట్టు నేతలు చెప్పారు.

మేయర్ దంపతుల హత్య కేసులో
మరో ఇద్దరు అరెస్టు

చిత్తూరు, నవంబర్ 25: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ల హత్యకు సంబంధించి బుధవారం మరో ఇద్దరు నిందితులను బుధవారం చిత్తూరులో అరెస్ట్ చేశామని డిఎస్పీ లక్ష్మీనాయుడు విలేఖరులకు చెప్పారు. జంట హత్యల కేసులో ఏ7 గా ఉన్న యోగ, ఏ11 గా ఉన్న శశిధర్‌లను పక్కా సమాచారంతో అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇదిలాఉండగా మేయర్ దంపతుల హత్యకు సహకరించిన 47వ డివిజన్ కార్పొరేటర్ అన్నపూర్ణ భర్త మురుగ మంగళవారం సాయంత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు వచ్చిన సమాచారాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా ఈ కేసుకు సంబంధించి మంగళవారం అరెస్ట్ చేసిన వెంకటాచలపతి, మంజునాథ, జయప్రకాష్‌రెడ్డిలను బుధవారం కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.