వరంగల్

హత్యా? ఆత్మహత్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, డిసెంబర్ 27: చెన్నారావుపేట ఖాదర్‌పేట గుట్టల్లో ఇద్దరు ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. ఈ ఇద్దరు విద్యార్థినుల మృ తదేహాలు పూర్తిగా ముక్కలు ముక్కలు అయి కుళ్లిపోయాయి. పది రోజుల క్రితం చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు విద్యార్థినిలను ఎవరైనా హత్య చేశారా లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయాల్లో మి స్టరీ నెలకొంది. పర్వతగిరి మండలం నారాయణపురం తండాకు చెందిన బానోతు కిషన్ కుమార్తె బానోతు భూ మిక (14), అదే తండాకు చెందిన బానోతు బా లు కుమార్తె బానోతు ప్రియాంక (14)లు ఇ ద్దరూ నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ప్రియాంక, భూమికలు ఇద్ద రు వరుసకు అక్కాచెల్లెళ్లు. కాగా నవంబర్ 9న తమకు జ్వరం వస్తుందని, తాము ఇంటికి వెళతామని ప్రియాంక, భూమికలు హాస్టల్ వార్డెన్‌కు చెప్పడంతో పదవతరగతి విద్యార్థిని వీరికి తోడుగా వార్డెన్ పంపించింది. పది రో జు లు గడిచినా వసతి గృహానికి ఈ ఇద్దరు విద్యార్థినిలు చేరుకోకపోవడంతో వార్డెన్ ఆఇద్దరు విద్యార్థుల తల్లితండ్రులకు ఫోన్ చేసింది. తమ తమ ఇళ్లలో రెండు రోజులు మాత్రమే ఉండి, హాస్టల్‌కు వెళుతున్నామని చెప్పి వెళ్లారని తల్లితండ్రులు చెప్పగా తమ వసతి గృహానికి రాలేదని వార్డెన్ స్ప ష్టం చేసింది. వార్డెన్ ఫోన్ చేసిన మరుసటి రోజు ప్రి యాంక, భూమిక తల్లితండ్రులతో పాటు విద్యార్థి సంఘాలకు చెందిన ఇద్దరు నాయకులు వసతి గృహానికి చేరుకుని ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినిలు ఇద్దరూ వసతి గృహానికి రాలేదని వార్డెన్ చెప్పగా.. తమ పిల్లలు వస్తే వసతి గృహంలో పనిచేస్తున్న ఓ వర్కర్ దూషించడంతో మనస్థాపంతో వెళ్లిపోయారని విద్యార్థినిల తల్లితండ్రులు అప్పట్లో వార్డెన్‌పై చేయి చేసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న ఓ విద్యార్థి సం ఘానికి చెందిన నాయకులపై వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై పోలీసులు కేసు నమోదు సైతం చేశా రు. కాగా తమ పిల్లలు కనిపించకుండా పోయారని పర్వతగిరి పోలీసులకు ఇద్దరు బాలికల తల్లితండ్రులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో నవంబర్ 23న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అప్పటి నుండి ఈ ఇద్దరు విద్యార్థినిల ఆచూకి లభించలేదు. ఆదివారం ఉ దయం చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేటకు రెం డు ఊరకుక్కలు శరీర భాగాల(కాళ్లు)ను నోట్లో కరుచుకుని గ్రామంలోకి ప్ర వేశించాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేసి సమాచారాన్ని చెన్నారావుపేట పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాదర్‌పేట గుట్టలను గాలించారు. గుట్టల్లో కుళ్లిపోయిన రెండు మృతదేహాలను కనుగొన్నారు. సంఘటనా స్థలంలో లభించిన పాస్‌ఫొటోల ఆధారంగా వీరిద్దరూ నారాయణపురం తండాకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థినిలు భూమిక, ప్రి యాంకలుగా గుర్తించారు. తెరవని పురుగుల మందు డబ్బా, కాళ్ల పట్టీలు ఉన్నాయి. జిల్లా రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, నర్సంపేట రూరల్ సిఐ బోనాల కిషన్, చెన్నారావుపేట ఎస్‌ఐ పులి వెంకట్‌లు దర్యాప్తు ప్రారంభించారు.