సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

517. అంత మూడు జాములు గడచి తెల తెల్ల
వార నుండగ యాజకుల్వేద విధులు
రాక్షస బ్రహ్మ లుచ్చైస్వరమున జదువు
వేద ఘోషను నగరు ప్రతిధ్వనించె

518. రాక్షసేంద్రుడు మేల్కాంచి రాజవదన
సీత మనసున మెదలగ మదన తాప
నిగ్రహము లేక వచ్చె నశోకవనికి
సుందరీజనంబులు తన్ను గొల్చిరాగ

519. ఆకులందున దాగిన హనుమజూచు
చుండె జానకి భయకంపితాంగి చ
ఈ నిశాచరుడెపుడు నిర్జింప బడునొ
దశరధాత్మజుచే నని దలచుచుండె

520. సంకుచిత గాత్రియై ముఖమవనతమ్ము
జేసి దేహమిచ్చటనున్న మనసు రామ
సన్నిధికి జేర్చి సంకల్ప తురగములను
రామ ధ్యానము నందుండె రామ రామ!

521. వజ్రభూషణ కాంతులు దిశలు వెలుగ
చెఱకు విల్లు ధరించని మారునట్లు
వల్లెవాటు విలాసముగ సవరించు
కొనుచు రాజసమ్మున దశకంఠు డొచ్చి

522. సీత దరిజేరి ఓ సుందరాంగి! కుంద
రదన! కమనీయ కటి సూత్ర! మందగమన!
మనసు కుల్లాసమొసగు మనోజ్ఞమైన
నీదు సౌందర్యమును దాచుకొందువేల

523. నారవస్త్రాలు గట్టి కాననములోన
కటిన నేలను వయనించి కందమూల
భక్షణముజేయు నారాజ్యహీను దీను
నరుని కోరెదవేల? సుందర కపోల!

524. తపబల పరాక్రమ యశస్తేజముల యందు
సంపదల రాజ్యశ్రీ లోన సాటి నాకు
రాడు రాముడు నను పతిగా వరించి
సర్వ సుఖముల పొందుము సరసిజాక్షి

525. అప్సర స్ర్తిలు లక్ష్మిని గొల్చునట్లు
నాదు పత్నులు నిన్ను సేవింతు రెపుడు
మూడు లోకంబులను నే జయించి దెచ్చి
న ధనమంత పంచిమ్ము నీ బంధువులకు

526. యవ్వనమ్ము నదీ ప్రవాహమ్ము రీతి
నిలువ నేరదు పూర్ణ చంద్రానన నిను
నలువ సౌందర్య లావణ్యములను మరొక
ఇంతి యుండరాదని సృజియించె నేమొ

527. కారు మేఘము లడ్డమై కమ్ముకొన్న
చంద్రబింబమ్ము జూడ లేనట్లు నిన్ను
జూడ రాముని శక్యము గాదు ఇంద్రు
కీర్తి హేమకశిపునకు దక్కనట్లు

528. నను వరించి యమర సౌఖ్యముల్పొందె దో
మూర్ఖురాలివై తృణీకరించి
నాదు సేవకులచె నలయింప బడెదవో
నిర్ణయించు కొనుము నెలత? నీవు

529. అనుచు రవాణు డతికామ పరవశమున
ప్రేలు మాటలు విని సీత తృణము నొకటి
రావణున కడ్డుగానుంచి ధైర్యమూని
బల్కె రావణుతో స్థిరబుద్ధితోడ

530. ‘‘రావణా! నన్ను గోరు నీ భార్యలందు
నీదు మనమున లగ్నమొనర్చు కొనుము
పాపబుద్ధులు పుణ్యసిద్ధులను పొంద
లేని విధముగ నేను నీకందనెపుడు

531. రామచంద్రుని భుజసీమయె యుపదాన
ముగను శయనించు నేను మరొకరి కన్ను
లెత్ని జూడను నీవు వివేకి వేని
నన్నురాఘవునకు సమర్పించుకొనుము
*

టంగుటూరి మహాలక్ష్మి