సబ్ ఫీచర్

పెళ్లికూతురి ఔదార్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సానుకూల పరిణామాలు మనల్ని ఉత్సాహపరుస్తున్న సమయంలోనే కొన్ని ప్రతికూల సంఘటనలొచ్చి కుంగదీస్తాయి.ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మార్గంనుంచి పక్కకు తొలగే పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి ఎనె్నన్నో ప్రతికూల పరిణామాలను కూడా ఎదురీది విజేతగా నిలిచిన వారు నిజమైన ధీరోదాత్తులు.
ఈ సూక్తికి నిజమైన ఉదాహరణ క్విన్ డ్యూన్
పెళ్లిలో విందు బంధుమిత్రులకు ఆనందం.. పెళ్లి తర్వాత హనీమూన్ ఆ కొత్త జంటకు ఆనందం. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ మనకే తెలియని మన ఊహకు అందని పెళ్లి వేడుక తాజాగా అమెరికాలో జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన క్విన్‌డ్యూన్-లాన్డన్ బోరప్‌లు వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. స్థానికంగా వున్న ప్రముఖ సిటిజన్ హోటల్‌లో వివాహ వేడుక జరుపుకోవాలని ఆర్డర్‌లన్నీ ఇచ్చేసారు. అయితే వివాహం వారం రోజులు వుందనగా పెళ్లికొడుకు వున్నట్టుండి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. అయితే అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హాల్ బుకింగ్, పూల అలంకరణలు, ఆహార పదార్ధాల ఆర్డర్‌లు వంటి పలు ఘట్టాలు పూర్తయ్యాయి. వరుడి స్టేట్‌మెంట్‌తో పెళ్లికూతురు ఒక్కసారిగా నిశే్చష్టురాలైంది. తర్వాత షాక్‌నుంచి తేరుకుని కొంచెం కొత్తగా ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకుంది. భర్తతోనే హనీమూన్ జరుపుకోవాలని ఏం లేదుగా? కొత్తగా కూడా హనీమూన్‌ని జరుపుకోవచ్చుగా? అంతే ఆలోచనని ఆచరణలో పెట్టేసింది.
పెళ్లి ఏర్పాట్లలో భాగంగా అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు చాలావరకు వెనక్కు రాదు కాబట్టి తాను పెళ్లి కోసం పెట్టిన 35,000 డాలర్ల ఖర్చులో కొంతైనా సద్వినియోగం చేయాలని నిశ్చయించుకుని ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది. తల్లిని పిలిచి తాను తీసుకోబోయే చర్య గురించి వివరించింది. దీని గురించి ఆ సంస్థ సవివరంగా పెళ్లి విందుపై ప్రచారం చేసింది. ఇళ్లులేని వాళ్లు, ఒంటరివాళ్లు, వృద్ధులు, పసిపిల్లలని విందుకు ఆహ్వానించారు. వారంతా ఆనందంగా ఆ భోజనం ఆరగించి తృప్తిగా వెళ్లిపోయారు.
దీనిపై తాజాగా పెళ్లికూతురి తల్లి ఆనందం వ్యక్తం చేస్తూ..తన కూతురికి ఇలా జరగడం బాధ కలిగించినా ఇలాంటి కష్ట సమయాల్లో కూడా ఇంతటి హుందాగా మానవత్వంతో ఆలోచించడం తామందరి హృదయాలకు హత్తుకుంది అంటూ ఆనందబాష్పాలు రాల్చింది. ఇక్కడి వరకు బాగానే వున్నా కథలో అద్భుతమైన ట్విస్ట్ తర్వాతే జరిగింది. అది ఏమిటంటే పెళ్లి సందర్భంగా హనీమూన్ కోసం బుక్ చేసినవి వెనక్కి రావు కాబట్టి సదరు కొత్తపెళ్లి కూతురు తన తల్లిని తీసుకుని హనీమూన్ పేరు చెప్పి ప్రకృతిని ఆస్వాదించడానికి హనీమూన్‌కి వెళ్లిపోయింది. ఒక నష్టాన్ని కూడా సమాజ హితం కోసం ఏవిధంగా ఉపయోగించవచ్చో ఈ ఘటన ప్రపంచానికి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి