సబ్ ఫీచర్

ఈ పరీక్షా విధానం ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతస్తులు గల సమాజం ఎప్పుడూ కూడా తనకన్న తక్కువ హోదా వున్న వారిని నమ్మదు. అధికారంలో వున్నవారి కాళ్లను వదలదు. అలాంటి సమాజం మన విద్యావిధానానికి పునాది వేసింది. ఆ సమాజంలో యంత్రాంగం విద్యార్థిని, ఉపాధ్యాయులిద్దరిని, నమ్మదు. పరీక్షలే మొత్తం విద్యావిధానాన్ని శాసిస్తున్నాయ. అందుకే మన చదువులో తరగతి గదికన్నా పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి పరీక్షలంటేనే పిల్లలకు హడల్‌గా మారింది. ఉపాధ్యాయులకు భయంగా మారింది. భయమున్నచోట విధేయత అవసరం. ప్రేమ ఉన్నచోట అవగాహనాశక్తి పెరుగుతుంది. కాబట్టి చాలా ప్రగతిశీల దేశాల్లో పరీక్షలకన్నా తరగతి గది చదువుకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. పరీక్షలను రద్దుచేయటమంటే జవాబుదారీతనం లేనటువంటి వ్యవస్థను సృష్టించటం కాదు. జవాబుదారీతనం ఎవరికోసమో కాదు. ఉపాధ్యాయుడు తన కోసమే తాను నిర్మించుకున్న వ్యవస్థ. అది తను నిర్మించిన కట్టడం ఎంత గట్టిగా ఉన్నదో చూసుకోవలసిన బాధ్యత ఉపాధ్యాయునిదే. ఆ కట్టడం సుస్థిరమైందా? కాదా? అనేది తెలుసుకోగలిగేది ఉపాధ్యాయులు మాత్రమేనని గుర్తించాలి. ఆ చదువుకు సంబంధించిన లోట్లుపాట్లను పిల్లల్లో కనిపెట్టగలగాలి. అప్పుడు మాత్రమే పిల్లల్లో లోటుపాట్లు తెలుస్తాయి. మా కట్టడంలో పగుళ్లు ఉంటే బైటకువస్తాయి. అవి ఎందుకొచ్చాయి. తన లోపమా? లేక విద్యార్థి నేపథ్యం లోపమా? దానిని పర్యావలోకనం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి.
పిల్లలకు పరీక్షలు శిక్షించటంకోసం కాదు. పిల్లల్లో భయాన్ని పెంచటానికి కాదు. పిల్లలయొక్క సమర్థతను పెంచేందుకు, తాము చెప్పిన పాఠం, పిల్లలు పాఠాలపై పెంచుకున్న అవగాహన తెలుసుకునేందుకే పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షలంటే బట్టీలు పట్టించటం కాదు. వల్లెవేతలు అంతకన్నా కాదు. పిల్లల్లో స్థిరత్వాన్ని పెంచటానికి, కట్టడం శక్తివంతంగా ఉండేందుకు మాత్రమే నిర్వహించాలి. రాబోయే 50 సంవత్సరాల వరకూ తరగతి గదిలో కట్టే కట్టడం నిలువగలుగుతుందా? లేదా? చూసుకోవాలి. విద్యార్థి పై చదువులకు చదువగలుగుతారా? లేదా తయారుచేసే దశలోనే అంటే నిర్మించే దశలోనే చూసుకుంటే సులభంగా సరిదిద్దవచ్చును. ఒక సంవత్సరం లేదా ఆరు నెలల తర్వాత విద్యార్థుల ప్రగతి కనుక్కుంటే జరగవలసిన అపకారం జరిగే ఉంటుంది. ఏ రోజుకారోజు, ఏ వారానికి ఆవారం, ఏ నెలకు ఆ నెల చూసుకుంటే తన జవాబుదారీతనం అర్థవంతంగా ఉంటుంది. పరీక్షలు రద్దుచేయటం అంటే బాధ్యతలనుంచి తప్పుకోవటమని కాదు. బోధనను పటిష్టంచేయటానికి తీసుకున్నటువంటి చర్యలను పాటించకపోవటం వలన విద్యావ్యవస్థకు చెదలు పట్టింది. అది కుళ్లిపోయినప్పటికినీ పాత అంతస్తుగల సమాజాన్ని నమ్మేవారు మునుపటి మాదిరిగా పరీక్షలే ఉండాలని వాదన చేస్తారు. పరీక్షలను మళ్లీ ప్రవేశపెట్టాలనే వాదన చూస్తే అది కాలాన్ని తిరిగి వెనక్కు తీసుకుపోవటమే అవుతుంది. దానికన్నా తరగతి గదియొక్క లక్ష్యాన్ని పటిష్టం చేసుకుంటే ముందుకుపోగలుగుతాం. నూతన విద్యాపాలసీలను రచించే నాయకులకు విజ్ఞప్తి. ఉపాధ్యాయులను నమ్మండి. జవాబుదారీతనం ఉండే వ్యవస్థను సృష్టించుకోండి.
ఒక మనిషిని నమ్మితేనే ఆ వ్యక్తి మనసుపెట్టి పనిచేస్తాడు. చాలా దేశాల్లో సూపర్‌వైజీ స్ట్ఫా (పర్యవేక్షణా సిబ్బంది)ను మార్గదర్శకం చూపే ఆఫీసర్ అంటారు కానీ పెత్తనంచేసే వాడని అనరు. మనం రూపొందించిన పదాలే పాలనావ్యవస్థకు కొత్త బాటలు వేస్తాయి. ఒదిలిన బాటకు మరలా తీసుకరావటం కాలచక్రాన్ని తిరిగి వెనకకు తీసుకురావటమే.

- చుక్కా రామయ్య