సబ్ ఫీచర్

గుండె ఆపరేషన్ చేయించుకున్నవారిలో పంటి చికిత్స?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

కొంతమంధి పిల్లలు గుండెలో లోపాలతో పుడుతున్నారు. చాలామందికి, ఆడా మగా అన్న తేడా లేకుండా చిన్న వయసులోనే గుండె సమస్యలు మొదలవుతున్నాయి. వారందరికీ మందుల ద్వారా, ఆపరేషన్‌ల ద్వారా చికిత్స చేసే ప్రయత్నం జరుగుతున్నది. బైపాస్ అని, స్టంట్(STENT) అని, గుండె వాల్వ్‌ల మార్పిడి (VALVE REPLACEMENT) అని, పుట్టుకతో వచ్చిన గుండె సమస్యల ఆపరేషన్ అని వేరు వేరు చికిత్సా విధానాలు ఉన్నాయి. ఇలా సమస్యలున్నవారు కాని లేక ఆపరేషన్ చేయించుకున్నవారు కాని ఎక్కువ గందరగోళం చెందకుండా వారు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను.

గుండె ఆపరేషన్ - దంత చికిత్స
గుండె ఆపరేషన్ జరిగాక సాధారణంగా అందరికీ దంత చికిత్స చేయించుకునే ముందు గుండె డాక్టర్ అనుమతి తీసుకోండి అని చెప్పబడుతుంది. మీకు దంత సమస్య వచ్చినపుడు చికిత్స చేసే దంత వైద్యుడు కూడా గుండె డాక్టర్ అనుమతి పత్రం కోరతాడు. గుండె ఆపరేషన్ జరిగిన వారిలో దంత చికిత్స చేసేప్పుడు నోట్లోంచి క్రిములు రక్తం ద్వారా గుండెకు చేరి INFECTIVE ENDO CARDITIS అనే ఇన్‌ఫెక్షన్ కలిగించే ప్రమాదం ఉంది. అందుకే వీరిలో దంత చికిత్స చేసే ఓ గంట ముందు, కొన్ని పేర్కొన్న ఆంటీబయాటిక్స్ అంటే ఇన్‌ఫెక్షన్ చేసే క్రిములను అంతం చేసే మందులను సూచించబడిన మోతాదులో తీసుకోవాల్సి వుంటుంది. దీనిని ANTI BIOTIC PROPHYLAXIS అంటారు. అలా తీసుకోవడం మర్చిపోయిన వారిలో దంత చికిత్స జరిగిన రెండు గంటల వరకు తీసుకునే అవకాశం ఉంది.
ఎవరిలో ఈ పద్ధతి అవసరం అంటే
ఇంతకుముందు ఇన్‌ఫెక్టివ్ ఎండో కార్డైటిస్ ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారిలో
గుండె వాల్వ్ మార్పిడి జరిగిన వారిలో
కొన్ని పుట్టుకతో ఉండే గుండె సమస్యలకు (అవి ఏంటో మీ గుండె డాక్టర్ చెబుతారు)
పుట్టుకతో వున్న గుండె సమస్యల ఆపరేషన్ జరిగిన ఆరు నెలల వరకు
ఆపరేషన్ జరిగాక ఆ పక్కన లోపాలు వచ్చిన వారిలో
వీరిలో ఆంటీ బయాటిక్స్ ఇచ్చాక దంత చికిత్స చెయ్యడం ఉత్తమం. ఈ మందులు నోటి ద్వారా కానీ సూది ద్వారా కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.
రక్తం పలచబరిచే మందులు
చాలామంది గుండె సమస్యలున్నవారిలో ఆపరేషన్ జరిగిన వారిలో రక్తం పలచబరిచే మందులు ఇస్తారు. ఇవి రక్తకణాల్లో రక్తం గడ్డకట్టకుండా సాఫీగా పారేలా చేస్తాయి. అలా వాడే కొన్ని మందులు పేర్లు
- ASPIRIN (ఆస్పిరిన్), - CLOPIDOGREL (క్లొపిడొగ్రల్), - TICLOPIDINE (టైక్లొపిడిన్), - WARFARIN (వార్‌ఫరిన్), - HEPARIN హిపారిన్)
వేరు వేరు సందర్భాలలో ఈ పై వివరించబడిన మందులు వాడే ప్రయత్నం చేస్తారు.
ఈ పై మందులు వాడినపుడు రక్తం గడ్డకట్టకపోవటం మూలన దంత చికిత్స జరిగేప్పుడు లేక ఆ తర్వాత రక్తం గాయం నించి కారడం ఆగదు. దానివల్ల చాలా రక్తం పోయి ప్రాణానికే ప్రమాదం కలగవచ్చు. అందుకే కొన్ని రక్తపరీక్షలు చేసి వాటి ఫలితాలను బట్టి ఈ మందులు మానాల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్థారిస్తారు.
100, బీడింగ్ టైం, పి.టి., ఐ.ఎన్.ఆర్, పి.టి.టి అనే వివిధ రకాల రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది.
చాలామంది వాడే ఆస్పిరిన్ మందు మానాల్సి వస్తే అది వారం పది రోజుల ముందు ఆపి తర్వాత దంత చికిత్స చేయించుకోవడం మంచిది.
పరీక్ష పాస్ అయి కొత్తగా క్లీనిక్ పెట్టిన ఓ యువ డాక్టర్ దగ్గరికి ఓ ముసలి పేషెంట్ వచ్చేడు. ఆ పేషెంట్‌ని పరీక్షించిన ఆ డాక్టర్ ‘ఓ పన్ను తియ్యాలి’ అని చెప్పాడు. ‘‘ఎప్పుడు తీసేస్తారు’’ అని అడిగిన ఆ పేషెంట్‌తో డాక్టర్ ‘‘మీరు సరే అంటే ఇప్పుడే తీసేద్దాం’’ అని అన్నాడు. ఆ పేషెంట్ ‘‘నాకు గుండె ఆపరేషన్ అయింది, ఆస్పిరిన్ మాత్రలు వాడుతున్నా’’ అని అన్నాడు. దానికి ఆ డాక్టర్ అవాక్కై ‘‘ముందే ఎందుకు చెప్పలేదు, నయ్యం ఇంకా పన్ను తీసేయలేదు’’ అని ఆనందపడ్డాడు. ‘‘మీరు అడగలేదు, నేను చెప్పలేదు. మీరు అడుగుతారని ఎదురుచూశా కానీ? మీరు కొత్తగా పాస్ అయ్యా రా?’’ అని అడిగాడు ఆ పేషెంట్. ‘అవున్నాడు’ డాక్టర్. ‘మీరు కొత్తగా పాస్ అయిన డాక్టర్, నేను చాలా అనుభవం వున్న పాత పేషెంట్’ అని నవ్వుతూ రాసిన మందుల చీటీ, రక్తపరీక్ష చీటీ తీసుకొని వెళ్లిపోయాడు. ఇలాంటి ఎన్నో సందర్భాలు మనకి జీవితంలో ఎదురవుతాయి. వాటినించి మనం ఎంతో నేర్చుకుంటాం. పాఠశాల చదివిస్తుంది, జీవితం నేర్పిస్తుంది. అనుభవాన్ని మించిన గురువు లేడు. జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు. సమయాన్ని మించిన శక్తి లేదు.

-డా. రమేష్ శ్రీరంగం