సబ్ ఫీచర్

మధుమేహ రోగులకు ఆహారం ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాము తీసుకునే ఆహారం పట్ల తగిన అవగాహన కలిగి ఉంటే మధుమేహ రోగులు ఉపశమనం పొందే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్-ఎ, పీచు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషక విలువలున్న శాకాహారాన్ని తినడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. పిండి పదార్థాలున్న ఆహారానికి వీరు దూరంగా ఉండడం ఎంతో అవసరం. పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, కొవ్వు లేని పాల ఉత్పత్తులను తీసుకోవడం ఉత్తమం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, పీచు, పొటాషియం, మెగ్నీషియం కలిగిన బీన్స్ మధుమేహరోగులకు వరం లాంటివి. ఎముకలు, దంతాల పరిపుష్ఠికి విటమిన్-డిని అందించే పాలు, పాల ఉత్పత్తులను తీసుకున్నా వాటిలో ఎక్కువ కొవ్వు లేకుండా జాగ్రత్తపడాలి. ఒమెగా-3, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం వంటి పోషకాలు అందేలా ఓట్స్ ధాన్యం తీసుకోవాలి. వరి బియ్యం వినియోగాన్ని బాగా తగ్గించడం అవసరం. ఐరన్, విటమిన్ సి,ఇ, కె పుష్కలంగా లభించే టమాటాలను తరచూ తినాలి. నూనెలో వేపడానికి బదులు టమాటా ముక్కలను ఉడికించి తినడం వల్ల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఒమెగా-3 ఫాటీ యాసిడ్లను అందించే గింజలను తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటూ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరు మెరుగ్గా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా కలిగి, ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించే ఆకుకూరలు విధిగా తీసుకోవాలి. పీచు, ఖనిజాలు ఎక్కువగా ఉండే తోటకూర, బచ్చలి, క్యాబేజీ వంటివి విరివిగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాన్ని అందిస్తూ, రక్తంలో కొవ్వుశాతాన్ని తగ్గించే కాప్సికమ్, వంకాయ, పుట్టగొడుగులను వంటల్లో వాడుతుండాలి.