సబ్ ఫీచర్

విమానం అంటే ఇష్టం .. కెప్టెన్ నివేదిత భాసిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగిరే విమానాన్ని చూస్తే చిన్నపిల్లలు కేరింతలు కొట్టినట్లే నివేదిత భాసిన్ కూడా అమితంగా అభిమానిస్తారు. ఈ అభిమానమే ఆమెను 26 ఏళ్లకే పైలట్‌గా మార్చింది. కెప్టెన్ నివేదిత భాసిన్ పేరు విమానయాన రంగంలో తెలియనివారు ఉండరు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఎయిర్ ఇండియాలో వివిధ హోదాలలో పనిచేస్తున్న సీనియర్ అధికారిణి. ఎందరో యువ పైలట్లకు ఆమె ఆదర్శం. ఎందుకంటే ఇటీవల జరిగిన మహిళాదినోత్సవానికి గుర్తుగా ఆరోజు మహిళా పైలెట్లతోనే ఎయిర్ ఇండియా విమానాలు చాలావరకు ఆకాశంలోకి దూసుకువెళ్లాయి.
ఆనాటి మహిళా యువ పైలట్లకు కెప్టెన్ నివేదిత భాసిన్ నాయకత్వం వహించారు. 54ఏళ్ల నివేదిత భాసిన్‌కు ఎగిరే విమానానికి అభిమానిగా పిన్నవయసులోనే మారిపోయారు. అందుకే ఆమె 26 ఏళ్లకే పైలట్‌గా ఎయిర్ ఇండియాలో బాధ్యతలు చేపట్టారు. చిన్న వయసులో పైలట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా సివిల్ యావియేషన్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఎగిరేవిమానంలో కూర్చున్నానంటే వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతాను. ప్రయాణీకులను వేరేప్రాంతానికి చేరవేస్తున్నాననే భక్త్భివం నాలో నెలకొంటుందంటారు.
పైలట్ల ఫ్యామిలీ
భాసిన్ కుటుంబ సభ్యులంతా పైలట్లే. తండ్రి పైలట్. ఆమె భర్త రోహిత్ భాసిన్ సైతం కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. మామగారు, కుమారుడు, కుమా ర్తె కూడా పైలట్లగానే స్థిరపడ్డారు. పైలట్‌కి సహనం ఎంతో అవసరం అంటారు. వాతావరణం సరిగాలే ని పరిస్థితుల్లోనూ ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చాలనే ధ్యేయంతోనే పనిచేయాలంటారు. అంకితభావం, క్రమశిక్షణ, సం కల్పం అనే లక్ష్యంతో పనిచేయాలని చెబుతారు.
నివేదిత భాసిన్ ప్రత్యేకతలు
1963లో జన్మించిన నివేదిత భాసిన్ ఢిల్లీలోని కార్మెల్ కానె్వంట్‌లో విద్యనభ్యసించారు. ఆమె 1984లో ఎయిర్‌లైన్స్‌లో జాయిన్ అయ్యారు. 18 ఏళ్లకే లైసెన్స్ సంపాదించారు. 1990 జనవరి ఒకటవ తేదీన ఐసి-492 కమర్షియల్ జెట్ విమానానికి పైలట్ అయ్యారు.
తొలి కో-పైలైట్‌గా వ్యవహరించారు. బోయింగ్ విమానానికి తొలి మహిళా కమాండర్‌గా పనిచేశారు.
ఎయిర్బస్ ఎ300 విమానాన్ని మహిళా దినోత్సవంనాడు ఢిల్లీ-ఖాట్మాండ వరకు నడిపారు. ఇదే ఎయిర్బస్ తొలి చెక్ పైలట్‌గా పనిచేశారు. తోటి పైలెట్లకు అంకితభావంతో శిక్షణ ఇచ్చే నివేదితకు 8,100 గంటలపాటు విమానం నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఎయిర్బస్ ఎ330-200కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.