సబ్ ఫీచర్

శ్రద్ధగా వినడం ఓ కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞా న సముపార్జనకు శ్రవణం ఒక రాజమార్గం. వింటున్న విషయాన్ని మనోచక్షువులతో కాంచినపుడు ఏ విషయమైనా మనసులో చెరగని ముద్రవుతుంది. ప్రసంగించడం ఒక కళ అయితే, వినడం అదీ ఏకాగ్రత వీడకుండా వినగలగడం అంతకుమించిన కళ. అటూఇటు దృష్టి మరలుస్తూ ప్రక్కనున్నవారితో సంభాషిస్తూ వింటున్న విషయంపై, ప్రసంగిస్తున్నవారిపై చెణుకులు వేస్తూ, నవ్వుతూ అరకొరగా వినడం అవగాహనను కుంటుపరుస్తుంది. పైగా విషయ సేకరణకు అడ్డంకులేర్పడి సమస్యను అధిగమించడంలో జాప్యం జరుగుతుంది.
మన ప్రయత్నం లేకుండా వినపడేవి ఉరుములు, వాహనాల మోతలు, కేకలు, విమాన గమనాలు, యంత్రాల సవ్వడులు, బాజాభజంత్రీలు, మైకుల్లో పాటలు మొదలైనవి. మన ప్రమేయం లేకుండా, మనకు వినాలన్న శ్రద్ధ లేకపోయినా వినపడేవి ఈ శబ్దాలు. ఇలాంటివి వినపడలేదని సందేహమొస్తే మాత్రం వినికిడి లోపమేమోనని సందేహించాలి. అయితే ఏం విన్నావో వివరించమని అడిగినపుడు పాఠమైనా, ప్రసంగపాఠమైనా నాకు సరిగా వినపడలేదు అని చెప్తే మాత్రం వినపడక కాదు వినిపించుకోలేదని సందేహించాల్సి వస్తుంది. వారికి వినాలన్న ఆసక్తికన్నా విషయంపై అనాసక్తతే విశదమవుతుంది. యథాలాపంగా వినడం కాక చెవులు రిక్కించి వినడంలోనే అవగాహన మెరుగుపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అని పదే పదే మనం వింటున్న నేటి రోజుల్లో ఆకళింపు చేసుకోవాలనే తపనతో వినడం ఈ నైపుణ్యానికి తొలిమెట్టు. కేవలం చెవి ఒగ్గడం కాక మనసును సిద్ధపరచి విషయాన్ని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోనైనా, కళాశాలలోనైనా, ఉద్యోగంలోనైనా వినేటపుడు మెళకువలు పాటించకపోతే మీతో మాట్లాడుతున్న వ్యక్తులకు మీ పట్ల ఉదాసీసనత కలిగి వారి అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకోడానికి ఇష్టపడరు. విలువలు, విజ్ఞానం, విశేషాలతో నిండినది జీవనవేదం. దీనిని సరియైన మానసిక పరిణతితో అర్థం చేసుకోవాలంటే వినడం కాదు వినిపించుకోవడం ముఖ్యం. విశ్వరూపాన్ని సూక్ష్మరూపంలో దర్శించే దార్శనికత పెంపొందాలంటే చిన్న చిన్న విషయాలనైనా శ్రద్ధగా వింటే ప్రోది చేసుకున్న విషయ వివరణంతా విజ్ఞానరాశిగా మారుతుంది. ఇతరుల మాటలకు అడ్డుపడకుండా, ఒకేసారి అందరు మాట్లాడకుండా ఉంటే వినాలనున్నవారి ఉత్సుకత పెంపొంది విషయం శ్రవణైక మకరందమవుతుంది.

- సి.ఉమాదేవి