రుచి

క్యాన్సర్లకు విరుగుడు కాలీఫ్లవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శాకాహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పలురకాల క్యాన్సర్లను నివారించే గుణం దీనిలో ఉంది. విటమిన్-సి,కెతో పాటు ఫోలేట్ (్ఫలిక్ యాసిడ్), పొటాషియం, పీచు అధికంగా లభిస్తాయి. క్యాన్సర్‌ను ఎదిరించే ‘సల్పోరాఫెన్’ (ఫైటో కెమికల్స్) కాలీఫ్లవర్‌లో గణనీయంగా ఉం టుంది. కెలొరీలు తక్కువగానూ, పోషకాలు సమృద్ధిగానూ అందించే కాలీఫ్లవర్‌ను తరచూ తింటే కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, బ్లాడర్, రొమ్ము, చర్మ సంబంధ క్యాన్సర్లను నివారించే అవకాశం ఉంది. ఇందులోని ‘సల్ఫోరాఫెన్’ వల్ల గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. కాలీఫ్లవర్‌ను ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం అంత ఎక్కువగా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో కొవ్వు శాతం సైతం తగ్గుతుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా సాఫీగా ఉంటుంది. వందగ్రాముల కాలీఫ్లవర్‌లో ఇరవై కెలొరీలు మాత్రమే ఉంటాయి. గనుక బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినడం మంచిది. ఇందులోని పీచు కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఇన్‌ఫెక్షన్లను నివారించి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని మాంగనీసు, కాపర్ వంటి ఖనిజాలు ఎదిగే చిన్నారులకు మేలు చేస్తాయి. చిన్నారులకు పిజ్జాలు, బర్గర్లకు బదులు కాలీఫ్లవర్‌తో చేసే సలాడ్లు, ఇతర వంటకాలు తినిపించడం మంచిది. మూత్రపిండాల సమస్యలున్నవారు తరచూ కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు శరీరంలోని వాపులను, కొవ్వులను దూరం చేస్తాయి. సోడియం, పొటాషియం తక్కువగా ఉన్నందున కిడ్నీ సమస్యలున్నవారు కాలీఫ్లవర్‌తో చేసిన వంటకాలు తినాలి. ఇది శరీరంలో నీటిశాతాన్ని అదుపు చేస్తుంది.
ప్రొటీన్లు తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది గనుక జీర్ణవ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. కిడ్నీలో వ్యర్థపదార్థాలు చేరకుండా ఉంటాయి. కాలీఫ్లవర్‌లోని విటమిన్-సి యాంటీ ఆక్సిడెంట్ మాదిరి పనిచేస్తూ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఇది నివారిస్తుంది. *