సబ్ ఫీచర్

పాదరక్షలకూ ఫ్యాషన్ సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికి మెరుగులు అద్దేందుకు ఫ్యాషన్ రంగం తహతహలాడుతు ఉంటుంది. డిజైనర్ల పనే అది. దుస్తులపై కొందరు దృష్టిపెడితే మరికొందరు ఇతర యాక్సెసరీస్‌పై శ్రద్ధ చూపిస్తారు. మేకప్‌పై కొందరు ఆసక్తి చూపి స్తే పాదరక్షలపై ఇంకొందరు దృష్టిపెడతారు. ముఖ్యంగా వివాహం లేదా ఇత ర వేడుకల సమయం లో వీటికి ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది. పెళ్లికూతురు లేదా అతిథులు ఎవరైనా సరే, అందమైన దుస్తుల్లో మెరిసిపోతుంటే, అంతే మెరుపుపాదాలవద్ద కనిపించాలనుకుంటారు. పెళ్లి అనే ప్రత్యేకమైన రోజున ఎలాం టి చీర కట్టుకుంటే అందుకు తగ్గట్టు చెప్పులను ఎంపికచేసుకోగలిగితే అందంగా మెరిసిపోవచ్చు. చెప్పుల ఎంపికలో సౌకర్యవంతంగా ఉండేటట్లు కూడా చూసుకోవాలి. లైట్ కలర్ లెహం గా లేదా చీర ధరిస్తే అందుకు తగ్గట్టు లైట్ కలర్‌లోనే చెప్పులను ఎంపిక చేసుకోవాలంటారు బన్సాల్ అనే ఫ్యాషన్ డిజైనర్. ఇపుడు టాలీవుడ్‌లో హీరోయిన్లు అందమైన మెరిసే బూట్ల ను ధరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ వేడుకకు చీర ధరించి వచ్చిన లావణ్య త్రిపాఠి సైతం స్నీకర్స్ ధరించారు. ఎక్కువ సేపు హైహీల్స్ మీద నిలబడాలంటే ఇబ్బందిగా ఉండటంతో వీటిని ఎంపికచేసుకుంటున్నా రు. సం ప్రదాయబద్ధంగా ఉండే ఉషాఊతప్ చెప్పుల ఎంపికలోనూ అదే సంప్రదాయాన్ని పాటించటం గమనార్హం. ఇపు డు నడుస్తున్న ట్రెండ్ మెటాలిక్ స్నీకర్లు లేదా బాలేరినాన్స్ బూట్లను ఎక్కువ ధరిస్తున్నారని ఫ్యాషన్ బ్లాగర్ మీనాక్షీ చెబుతున్నారు. పెళ్లిలో చీరలూ, లెహంగాలు ఎంచుకున్నా ఇవి అనువుగా, అందంగా ఉంటా యి. వీటిల్లో సాదా గా ఉండేవి, తెలు పు రంగు రకాలు ఎవ్వరికీ బాగుండవని ఆమె అంటున్నా రు. ము దురు బ్రౌన్ రంగు చెప్పు లు ఎలాంటి దుస్తులకైనా నప్పు తాయని అంటున్నారు. అలాగే సంప్రదాయ దుస్తులు ధరిస్తే మాత్రం స్నీకర్స్ జోలికే వెళ్లవద్దని చెబుతున్నారు.
స్నీకర్లు కేవలం ఖాదీ లేదా ఇక్కత్ చీరలు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవాటికే బాగుంటాయి. కాంట్రాస్ట్ రంగుల చెప్పుల ధరించవద్దని అశ్వనీ మావ్లే సలహా ఇస్తున్నారు. పెళ్లిల్లో సాధారణంగా ఉండేవి కాకుండా కొద్దిపాటి అలంకరణతో ఉన్న చెప్పులు ధరిస్తే ఎవరికైనా మంచిదే.