సబ్ ఫీచర్

మంచిని గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయులంతా రెగ్యులర్‌గా స్కూలుకు వస్తారా?
ఈ ప్రశ్న నన్ను చాలా బాధపెట్టింది. ఇది దేశ స్థాయిలో ప్రభుత్వం అడగవలసిన ప్రశ్నకాదు. దేశంలో ప్రతి డిపార్ట్‌మెంటులో కూడా మంచిచెడు రెండూ ఉంటాయి. మన దేశంలో వృత్తికి అంకితమైన ఉపాధ్యా యులు లేకుంటే, తల్లితండ్రి తరువాత గురువు అనే మాటే ఈ నేలలో ఉద్భవించకపోయేది.
గత 60 సంవత్సరాలల్లో నేను ఎందరెందరో గొప్ప ఉపాధ్యాయులను చూశాను. వారు ప్రతి దినం పాఠశాలకు రెగ్యులర్‌గా రావటమేకాదు, వారిదగ్గర చదువుకున్న విద్యార్థులపై చెరగని ముద్రవేశారు. అందరూ మంచివారేనని సర్ట్ఫికెట్ ఏమి ఇవ్వటంలేదు. పొలం అన్నప్పుడు అన్నీ పుష్పాలే ఉండవు కొన్ని ముళ్లు కూడా ఉంటాయ. ముళ్లు కనపడితే తీసివేసే ప్రయ త్నం చేస్తాం. అలాగే అధికారాలు ప్రభుత్వాలకు ఇదివరకే ఉన్నాయి. రెగ్యులర్‌గా రానివాళ్లపై చర్యలు తీసుకోకపోవటం ప్రభుత్వం యొక్క విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చక పోవటమే అవుతుంది. అలాంటి వారిని ప్రోత్సహించటం ఇంకా నేరం, వారిని చూపించి ఉపాధ్యాయ లోకమంతా ఇంతే అనుకోవటం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. సమాజానికి మంచివారినే చూపించండి కానీ చెడు చేసిన వారిని చూపించి ప్రభుత్వం చేయాల్సిన ధర్మంనుంచి తప్పించుకుపోయే ప్రయత్నాలు చేయకండి. ఇలాంటి ఉపాధ్యాయులను చూపించి విద్యారంగాన్ని ప్రైవేటైజేషన్ వైపుకు వెళ్లేవిధంగా ప్రోత్సహించకండి. ప్రజాస్వామిక వ్యవస్థలో అందరికీ సమానమైన విద్యవకాశాలను కల్పిస్తేనే సమానత్వం మూడుపూలు ఆరుకాయలుగా విలసిల్లుతుంది.
రెగ్యులర్‌గా పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిని ఆదరించేవారు తక్కువగా ఉన్నారు. వృత్తి ధర్మమే తమ ఆత్మ అనుకుని పనిచేస్తున్నవారు ఎందరెందరో ఉన్నారు. తాము చేసే పనినే దైవం అనుకునేవాళ్లు అనేకమంది ఉన్నారు. ఇలాంటి మనుషులను ప్రభుత్వాలు ఎప్పుడైనా సమాజానికి చూపించాయా? ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మంచినే చూపించండి. చెడును తొలగించండి. అది కనిపించకుండా తొక్కేయండి. కానీ చెడును ప్రోత్సహించి మంచిని కూడా కలుషితం చేయకండి. సత్ప్రవర్తన కల ఉపాధ్యాయులను నియమిస్తే విద్యతో వచ్చే అవకాశాలు అందరికీ అందగలుగుతాయి. సమాజాన్ని శిక్షలు సంస్కరించవు. చెడుకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తే అది మరింత వేగంగా విస్తరిస్తుంది. వౌనంగా చేయవలసిన పనికి ప్రచారం ఎక్కువచేసి, ప్రచారం చేయవలసిన పనిపై వౌనం వహించటం రెండూ తప్పే అవుతాయి. పాలకుల దృక్పధం మారితే చాలు. బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.
కాని ప్రస్తుతం దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. చెడుకు అధిక ప్రచారం కలగడం వల్ల ఉత్తములైన వారిలో కూడా ఒకరకమైన నైరాశ్యం ఏర్పడి తాము అప్పటి వరకు అనుసరిస్తున్న సక్రమమైన మార్గం నుంచి వైదొలగే ప్రమాదం ఉంటుంది. అయతే మనమందరం గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఎక్కడో చెడు కనిపించినంత మాత్రాన, అంతా చెడుగానే ఉన్నదన్న అభిప్రాయానికి వచ్చి దానికే విపరీత ప్రచారం కల్పించ కూడదు. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం సత్వరం కల్పిం చుకొని, వాటిని సరిదిద్దే యత్నం చేయాలి. అప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రైవేటు విద్యపట్ల నేటి తల్లిదండ్రులు ప్రధానంగా ఆకర్షితులు కావడానికి కారణం ప్రభుత్వ విద్యపట్ల ఉన్న చెడు అభిప్రాయం మాత్రమే కాదు, ఇంగ్లీషు భాషపట్ల పెరిగిన మోజు. కానీ ప్రైవేటు ఇంగ్లీషు విద్యా లక్ష్యాన్ని సాధించడంలో ఘోరంగా విఫలమైందన్నది మాత్రం సత్యం.

- చుక్కా రామయ్య