సబ్ ఫీచర్

సర్వం సమానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవరెక్కువ’అనే మీమాంస ఇప్పటిదికాదు. ఎన్నాళ్లనుంచో ఎందరి మధ్యనో నలుగుతూనే ఉంది. ఎవరికి వారు మేమే అధికులం అని లౌకిక ప్రపంచంలో విర్రవీగే వారున్నారు. అన్నీ శాస్త్రాలు, పురాణాలు చదువుకున్న పండితుల మధ్య కూడా అహంకారం చోటుచేసుకొని మేమేక్కువ అనే అపోహ ఉంది.
ఈ ఎవరెక్కువ అని ఆలోచిస్తుంటే ఈ విశాల ప్రపంచంలోఅసలీ సృష్టిలోను ఏ పదార్థమైనా వస్తువైనా దేని ప్రత్యేకతను అది కలిగిఉంది. అలాంటపుడు ఒకటి తక్కువ అని మరొకటి ఎక్కువ అని చెప్పలేము అంటారు పెద్దలు.
ఒకసారి రామకృష్ణ పరమహంసను తన గురువుగా ఎంచుకున్న వివేకానందులు లండన్‌లోని సెసీమ్ క్లబ్‌లో మాట్లాడుతూ ఇలా అన్నారు
‘‘ప్రకృతి అంతటా రెండు శక్తులు పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ఇందులో ఒకటి నిరంతరాయంగా విడిపోతున్నదీ, మరొకటి నిరంతరరాయంగా ఏకీకృతం చేస్తున్నదీ. ... ఈ ప్రపంచం అంతా కూడా ఈ రెండు శక్తుల యుద్ధరంగలాగా కనిపిస్తుంది’’
అవును నిజమే. విశ్వము, విశే్వశ్వరుడు ఒకటే. జగత్తు, జగన్నాథుడు ఒకటే. జగత్తు ఉంటే జగన్నాథుడు ఉన్నట్లే. సర్వాంతర్యామి లోనే సర్వమూ ఉంది. పెద్ద చేప చిన్న చేపను, చిన్న చేప మరో చిన్న క్రిమి తింటున్నట్లే చీమ చీమను పుట్టిస్తే ఏనుగు మరో ఏనుగుకు జన్మనిస్తుంది. ఒకవైపు సృష్టిక్రమం జరుగుతూ ఉంటే మరోప్రక్క సృష్టి లయం జరుగుతూ ఉంటుంది.
ఉన్నది ఒక్క భగవంతుడే. ఆ భగవంతుడే విష్ణురూపంలో సృష్టిని పాలిస్తున్నాడు. బ్రహ్మ రూపంలో సృష్టి రచన చేస్తున్నాడు. ఈశ్వర రూపంలో సృష్టిని లయం చేస్తున్నాడు. పుట్టేది ఇక్కడే పెరిగేది ఇక్కడే చివరకు మిగలకుండా పోయేది ఇక్కడే. అంటే ఇది అనేదే విశే్వశ్వరుడు. విశే్వశ్వరుని చిత్రమైన లీలనే విశ్వం.
అందుకే ఒకసారి యశోదమ్మ మన్ను తిన్నావేమి అని కృష్ణుడిని అడిగితే ఆయన నోరు చూపించారు. మన్ను తిన్న నోటిలోమన్ను కదా కనపడాల్సింది కాని పదనాల్గు భువనాలు కనిపించాయామెకు. శ్రీకృష్ణుడి చిన్న బొజ్జలోనే లోకాలన్నీ దాగున్నాయి. ఈ లోకాల్లోనే శ్రీకృష్ణుడుగా దేవకీనందుడుగా, యశోద ముద్దుబిడ్డగా పుట్టాడు. ఎదిగాడు. మరి ఇక ఎక్కడ ఎక్కువ తక్కువలున్నాయి. సర్వమూ ఈశ్వరుడైనప్పుడు అందరిలోను ఈశ్వరుడే ఉన్నప్పుడు ఒకరు తక్కువేమున్నది. మరొకరు ఎక్కువేమున్నది. ఉన్నది ఒకటే కనుక దానికి మించినది దానికి తక్కువైనదీ ఏదీ లేదు. అందుకే పెద్దలంతా ఉన్నది ఒక్కటే. కాని పండితుల నైపుణ్యంతో బహువిధాలుగా ఉన్నదాన్ని గురించి చెబుతారు. కనుక ఎన్నో ఉన్నట్టుగా సామాన్యులు భ్రమపడుతారు అని అంటారు.
దీనే్న వివేకానందులు ‘‘ఆధిక్యత అనేది ఎక్కడా లేదు. ప్రతి ఆత్మలోను జ్ఞానమంతా ఉంది. ఆఖరికి అత్యంత అవివేకిలో కూడా ఉంది. కాని దాన్ని అతడు ప్రదర్శించడంలేదు. ఈ యావత్తు విశ్వమంతా విభజన ఏకత్వాల క్రీడ... ఒకదాన్ని మినహాయించి ఇంకొకదాన్ని స్వీకరించలేము. అన్నారు. మరింత విపులంగా చెప్పాలంటే కుటుంబపు యజమాని తాను నెలంతా కష్టపడి నాలుగు రూకలు తెచ్చాడనుకొందాం.
ఆ నాలుగు రూకలనే కుటుంబంలోని నలుగురు ఒక్కొక్కటి చొప్పున తీసుకొని ఒక్కొక్కరు నాలుగు విధాలుగా ఖర్చు పెడుతున్నారు. కాని ఉన్నది నాలుగు రూకలే.కాని అవే నాలుగురూకలు నలుగురి దగ్గర 16 రూకలు మారిపోయింది. అట్లానే ఈ జగత్తు అంతా జగ్గనాటకం. జగ్గన్నాథుడైన ఈశ్వరుని లీలావిలాసమే. ఇందులో ఎవరూ ఎక్కువ గాదు. మరెవరూ తక్కువాను కాదు. అంతా సమానమే.

- ఆర్. పురంధర్