సబ్ ఫీచర్

జగమంత కుటుంబం నాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెలలో జరిగే ఆస్కార్ వేడుకల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసేందుకు ఎంపికైన సెలబ్రిటీగా మన దేశానికే ఖ్యాతి తెచ్చిన బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా మరో ఘనతను తాజాగా తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాత సామాజిక మీడియా ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఆమె అనుచరుల సంఖ్య అయిదు మిలియన్లకు చేరింది. ఇంతమంది అనుచరులకు తాను దగ్గర కావడం ఎంతో ఆనందానికి గురిచేసిందని ప్రియాంక ఇపుడు ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన ఫొటోలను, మనోభావాలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉం చుతూ ఆమె విశ్వవ్యాప్తంగా తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుచరుల సంఖ్య అయిదు మిలియన్లకు చేరడంపై ఆమె స్పందిస్తూ, ‘సామాజిక మీడియాలో అనుచరులంతా నా కుటుంబ సభ్యులే.. జగమంత కుటుంబం నాది.. ఇంతమంది హృదయాల్లో నాకు చోటు దక్కడం నిజంగా అదృష్టమే.. నటిగా నా ప్రతిభను అభిమానులు గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది..’ అని వ్యాఖ్యానించింది. ‘నా కుటుంబ సభ్యుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. ఇంతటి ఘనతకు కారణమైన నటన పట్ల మరింత అంకితభావంతో కృషి చేస్తా’ అని ఆమె చెబుతోంది. ఇటీవల అమెరికా టీవీ షో ‘క్వాంటికో’లో నటించిన ఈ 33 ఏళ్ల మాజీ ప్రపంచ సుందరి ఇపుడు విభిన్న పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.