సబ్ ఫీచర్

కడుపులో మంట తగ్గాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతటి ఆరోగ్యవంతులైనా ఏదోఒక సందర్భంలో ‘కడుపులో మంట’ సమస్యను ఎదుర్కొనక తప్పదు. కొంతమంది మాత్రం దీంతో నిత్యం సతమతమవుతుంటారు. అతిగా భుజించడం, మసాలా వంటకాలు, ఊబకాయం, మితిమీరి మద్యం, కాఫీ సేవించడం వంటివి ఎసిడిటీ (కడుపులో మంట)కి కారణాలని వైద్యులు చెబుతుంటారు. ఉదర భాగంలోని గాస్ట్రిక్ గ్రంధులు ఎక్కువ మోతాదులో యాసిడ్లను విడుదల చేయడం వల్ల కడుపులో మంటగా ఉంటుంది. కొంతమందికి ఛాతీ భాగంలో మంటగా ఉంటుంది. ఇవన్నీ ఎసిడిటీ లక్షణాలే. ఈ సమస్యను అధిగమించేందుకు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు అందుబాటులో ఉన్నా చాలామంది పట్టించుకోరు. ఇంట్లోనే కొన్ని పద్ధతులు ఆచరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎసిడిటీ నుంచి బయటపడేందుకు తరచూ కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. మద్యం, కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీ, హెర్బల్ టీని అలవాటు చేసుకోవడం ఉత్తమం. రోజూ ఉదయం పూట గ్లాసుడు పాలు తీసుకోవాలి. ధూమపానం వ్యసనానికి క్రమంగా స్వస్తి పలకాలి. వంటల్లో మసాలాలు పూర్తిగా తగ్గించాలి. నిల్వ పచ్చళ్లు, చట్నీలు, వెనిగర్, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. భోజనాన్ని మితంగా రోజుకు రెండు,మూడుసార్లు తగిన విరామం ఇస్తూ తీసుకోవాలి. మెంతి ఆకులను నీటిలో వేసి బాగా మరగబెట్టి చల్లారాక తాగాలి. కడుపులో మంటగా ఉన్నపుడు లవంగాలను బుగ్గన పెట్టుకుని రసాన్ని పీల్చాలి. మునక్కాయలు, గుమ్మడి, బీన్స్, క్యారెట్, క్యాబేజీ, ఉల్లికాడలు వంటి కూరగాయలను వాడుతుండాలి. అజీర్తి వల్ల కూడా ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రపోకుండా కాసేపు అటూ, ఇటూ తిరిగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.