సబ్ ఫీచర్

సొగసు చూడతరమా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత ప్రపంచానికి ఆస్కార్‌లాంటి గ్రామీ అవార్డుల సంబరం లాస్‌ఏంజిలిస్‌లో అట్టహాసంగా, హాలీవుడ్ తారలు, సంగీత రంగ ప్రముఖులతో కనులపండువగా సాగింది. సోమవారం రాత్రి జరిగిన 58వ గ్రామీ అవార్డుల వేడుకలో ఆధునిక సొబగులద్ది ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో, వింతైన మేకప్‌తో పాప్, రాక్‌స్టార్స్ రెడ్‌కార్పెట్‌పై అందచందాల ప్రదర్శనతో ఆహూతులను ఆకట్టుకున్నారు. సితార విద్వాంసుడు పండిట్ రవిశంకర్ తనయ అనౌష్కశంకర్ భారతీయత ఉట్టిపడే దుస్తులు ధరించి ప్రత్యేకత నిలుపుకోగా హాలీవుడ్ ప్రముఖులు ఆధునికపోకడలతోకూడిన కాస్ట్యూమ్స్‌తో కనువిందు చేశారు. మనీష్ అరోరా రూపొందించి, అల్లికలతో కూడిన దుస్తులతో అనుష్కశంకర్ ప్రత్యేకంగా కన్పించారు. చక్కటి వర్ఛస్సుకు లేసులతో కూడిన నీలిరంగు గౌనులో ఆమె మిలమిలా మెరిసిపోయారు. గ్రామీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా అవకాశం దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన అనుష్క గ్రామీ పోటీలో మాత్రం మరోసారి వెనకబడ్డారు. ‘బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్’ అవార్డుకోసం ఆమె రూపొందించిన ఆల్బమ్ ‘హోమ్’ నామినేషన్స్‌లో చోటు సంపాదించిన తుది పోటీలో విఫలమైంది. ఈ అవార్డును ఎంజిలికో కిడ్జ్ రూపొందించిన ‘సింగ్స్’ ఆల్బమ్‌ను వరించింది. అనుష్క ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు గ్రామీ అవార్డుల రేసులో నామినేషన్ల దశవరకు చేరుకోగా ఇంతవరకు విజయం దక్కకపోవడం నిరాశ కలిగించింది. కాగా ఈనెల 28న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్ తార ప్రియాంకచోప్రా ఎంపికైన విషయం తెలిసిందే. ఆస్కార్ వేడుకల్లో ఓ భారతీయ నటికి ఈ గౌరవం దక్కడంకూడా తొలిసారే. గ్రామీ అవార్డుల్లో భారతీయ మూలాలున్న బ్రిటన్‌కు చెందిన అసిఫ్ కపాడియా ‘బెస్ట్ ఫిల్మ్ మ్యూజిక్’ అవార్డును కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. 27 ఏళ్ల వయసులో మరణించిన పాప్ గాయని అమివైన్‌హౌస్ జీవితకథపై ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అమి రెండురోజుల క్రితం బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్ (బిఎఎఫ్‌టిఎ) అవార్డు సాధించిన విషయం తెలిసిందే. కాగా గ్రామీ అవార్డుల వేడకకు ముందు రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ ప్రముఖులు హొయలొలికించారు. ప్రఖ్యాత పాప్ గాయని రేడీ గగా వింతైన మేకప్, భిన్నమైన నీలిరంగు దుస్తుల్లో ఆహూతులను అలరించారు. ప్రఖ్యాత డిజైనర్ డేవిడ్ బోవె రూపొందించిన నీలిరంగు దుస్తులతో ఆమె మెరిసిపోయారు. ఇక ప్రఖ్యాత పాప్ గాయనీ మణులు టేలర్ స్విఫ్ట్ అట్‌లైన్ విరాసాసె రూపొందించిన కాస్ట్యూమ్స్‌తో అలరిస్తే మరో గాయని సెలెనాగోమెజ్, బెయాన్స్ అదరగొట్టేశారు.

గ్రామీ రెడ్‌కార్పెట్‌పై తారల
హొయలు