సబ్ ఫీచర్

విలువలు కోల్పోతున్న విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలువలు లేని విద్యా విషయాలవల్ల సమా జం మొత్తం తప్పుదారి పడుతోంది. ము ఖ్యంగా దైవప్రీతి, సంఘనీతి, పాపభీతి అనేవి మూడూ విద్యావ్యవస్థ ద్వారా సమాజం నేర్చుకోవాలి. వాస్తవంగా ప్రజలు సుఖశాంతులు కోరుకుంటున్న సందర్భంలో అవి ఎలా పొందాలి అన్న అంశాన్ని సులభంగా విద్యద్వారా అందించాలని మన సనాతన విద్యావిధానం చెబుతోంది. ప్లాటోరూసో వంటి పాశ్చాత్యుల సిద్ధాంతాలతో దేశవాళి విద్యావేత్తల విషయాలు మరుగున పరిచారు. విద్యానైపుణ్యాల గురించి విద్యార్థుల సత్ప్రవర్తన మానసిక వికాసం గురించిన చర్చ మన దేశంలో గురుకులాల్లో వైదిక కాలంనుండే వుం దన్న సంగతి మర్చిపోయారు.
భారతదేశ చిత్రపటం స్వాతంత్య్రం రాకపూర్వం స్వాతంత్య్రం వచ్చాక 60 దశాబ్దం తర్వాత పలుమార్పులతో సంకుచితం అవుతున్న సందర్భం. తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్ ఆవిర్భావం, ఆక్రమిత కాశ్మీర్ వీటన్నింటికి అసలు కారణం విద్యయొక్క పరమావధి సరైన దారిలో లేకపోవటమే. భారతీయ విద్య పదవీ వ్యామోహం ప్రాంతీయ అభిమానం బంధుప్రీతి వంటి అవలక్షణాలవల్ల ఈ దేశం లార్డ్‌మెకాలే కోరిన విధంగా వౌంటుబాటన్ దేశాన్ని విభజించారు. దీనికి ప్రధాన కారణం విద్యయొక్క పరమార్థం అర్ధవంతంగా అమలుకాకపోవటమే.
విద్య అనేది మానసిక శారీరక ఆత్మవికాసం కోసం అన్నది సనాతన భారతీయ విద్య. అయితే ప్రస్తుతం మనం విద్యని కేవ లం జీవనోపాధి నిమిత్తం అంటూ ఒక పరిధిని చట్రబద్ధం చేశాం. అంటే ఇంత చదువులు చదివి ఇంతింత సంపాదించాలని అది అక్రమమైనా సరే సక్రమం అయినాసరే సం పాదించగలిగామా లేదా అన్నదే లక్ష్యంగా వుంది. ప్రభుత్వంలోగల పాలకులు ప్రజలకి తాత్కాలిక ప్రయోజనాలు నెరవేర్చటంతోనే పొద్దుపుచ్చేస్తున్నాయి. తాత్కాలిక ప్రయోజనాలు నెరవేర్చిన తర్వాత అంతా అగమ్యగోచరంగా తయారవుతుంది. భారతదేశంలో విద్యావిధానాన్ని రూపొందించటానికి మనం మన భావజాలాన్ని విదేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం మనకోసం ఏర్పాటుచేసుకున్న పరిపాలనా విధి విధానాలు అంతా విదేశాలనుండి కాపీ చేసుకున్నాం.
అమెరికన్ రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాం గం, బ్రిటన్ రాజ్యంగంలోని కొన్ని అంశాలు ఇంకా ఇతరత్రా చిన్నాచితక దేశాల రాజ్యాంగాలని కాపీకొట్టి మన రాజ్యాంగం తయారుచేశాం. చాలా దేశాలు వారివారి పాత రా జ్యాంగాలు పాతకాలంనాటి అంశాలు పూర్తి గా మార్చి కాలానుగుణంగా కొత్త రాజ్యాంగాలు వ్రాసేసుకున్నా ఇంకా మనం పాతకాలంనాటి పాత చింతకాయ పచ్చడితోనే కాలక్షేపం చేస్తున్నాం. అయితే ఇందులో కొన్ని మంచిచెడ్డలున్నాయి. మంచి వాటిని ఆచరించి చెడువాటిని తొలగిస్తూ రాజ్యాంగంలో మార్పులుచేర్పులు చేసుకొనే వెసులుబాటు అధికారం చట్టసభలకి ఉంది. కొందరు స్వార్థపరులు సంకుచిత భావాలగలవారు కుహనా లౌకికవాదులు తమతమ భావజాలంతో ప్రతి మంచి పనికి సైంధవులుగా మారి అడ్డుకుంటుంటారు.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేనాటికి మహమ్మదీయులు మదర్సాలని, క్రైస్తవులు మిషనరీ పాఠశాలలు ఏర్పాటుచేసుకోగా వాటికి గ్రాంటు ఇన్ ఎయిడ్ ఇస్తూ ప్రస్తుతం మిగిలిన అన్ని పాఠశాలల్లోను సనాతన భారతీయ విద్యని ఏర్పాటుచేయాలని సర్దార్ వల్లభాయ్‌పటేల్ తగిన విధానాన్ని ఏర్పాటుచేసి అమలులోకి తెచ్చారు. పాఠశాలల్లో మత విషయాలు చెప్పటం నేరం కాదు. మత విద్వేషం కల్గించే అంశాలు చెప్పటం హింసకి ప్రేరేపించటం వంటి అంశాలు నేరం. మతం దానియొక్క పాత్ర తద్వారా నైతిక విలువలు ఏర్పరచి సమాజాన్ని నిర్మించటం అనేది నేరంకాదు. అన్ని మతాలు వారి వారి ఆరాధనా విధివిధానాలు మంచి సూక్తులు, ధర్మం, కర్తవ్యబోధన, తల్లిదండ్రుల పట్ల ప్రేమ జాతీయభావాలు పాదుకొల్పటం, దేశప్రేమ, మాతృభూమి పట్ల సదవగాహన కల్పిం చవచ్చు. దేశంలో జరుగుతున్న జాతివ్యతిరేక శక్తుల ఆగడాలు వంటి అంశాల గురించి వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలి అన్న అంశాలపై పిల్లలకు అవగాహన కల్గించటం చాలా అవసరం.
మతం అంటే దాని నిర్వచనం పరిధి, విస్తృతి రెండిటినీ అవగాహన చేయాలి. దేశం లో జరుగుతున్న విధ్వంస రచన పట్ల అంద రూ అవగాహన కల్గిఉండాలి. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, విచ్ఛిన్నకర శక్తులు వారి సిద్ధాంతాలు అధ్యయనం చేసి వారి అంతర్గతంగా ఉంటున్న అంతరంగ భావజాలంపై సమీక్ష చేసి నిర్ద్వందంగా తిరస్కరించే విచక్షణాశక్తి నవతరం భారతీయ విద్యార్థులకి నేర్పటం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం. మెజారిటీలు, మైనారిటీలు అన్న తారతమ్యం లేకుం డా ఉన్నది ఒకటే దేశం. ఉన్నది అంతా ఒకటే, అందరు ఒకటే అనే భావాల్ని పరివ్యాప్తం చేయాలి. దేశంలో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ తక్కువ అంటూ ఏ కొందరు వ్యక్తులకు గాని మతాలకి కాని సంఘాలకి కాని కొమ్ముకాస్తూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తూ నైతిక మానవతా విలువల్ని కాలరాయటం సహజ న్యాయసూత్రాలకి విరుద్ధం.
పాకిస్థాన్‌లో హిందూ ధర్మాన్ని అవలంబించే వారిని పూర్తిగా నిర్మూలిస్తున్నారు. మన దేశంలో అటువంటిది ఏదీ లేకపోయినప్పటికీ కొందరు కుహనా లౌకికవాదులు అదేపనిగా ఏదో అన్యా యం జరిగిందని ప్రచారం మొదలెట్టారు. ఇది మొత్తం దేశ సమగ్రతకే ప్రమాదం. జరిగింది ఇప్పటిదాకా అదే. తమతమ ప్రయోజనాలు నెరవేర్చుకొనేందుకు కొందరు దేశ సమగ్రతకి వ్యతిరేకంగా అంతర్గతంగా కృషిచేస్తూ దేశంలో శాంతి సామరస్య నిర్మూలనకి కృషిచేస్తూ పైకిమాత్రం తామే సెక్యులరిస్టులం అంటూ లోకా న్ని భ్రమింప చేస్తున్నారు. ఇటువంటి గోముఖ వ్యా ఘ్రానికి సాధారణ జనం గుర్తించాల్సిన సమయం వచ్చింది.
పాఠశాలల్లో దైవప్రార్థన నేరం అంటున్నారు. మానసిక దౌర్బల్యం వుంటున్న బాలబాలికల్లో ‘సమిష్టి ప్రార్థనలవల్ల ఆత్మశక్తి అభివృద్ధి అవుతుందని’ బాపూజీనే ప్రార్థనలు చేసేవారు. భారతదేశంలో ఇటువంటిది సర్వసాధారణంగా అన్నిచోట్ల యధావిధిగా జరగాలి. ఇది ఏ మతాన్నో ఏ సంస్కృతినో విధ్వంసం చేయమని చెప్పటం ఎలా అవుతుంది? దైవం ఒక్కడే అనే భావజాలాన్ని అందించటంవల్ల బాలబాలికల్లో నైతిక ధైర్యం అభివృద్ధి చెందుతుంది. బుద్ధితార్కికశక్తి ఆత్మశక్తి అభివృద్ధి చెందుతాయి.

- ఎన్.ఫణిప్రశాంత్