సబ్ ఫీచర్

లోక్‌సభలో పెరిగిన మహిళా ప్రాతినిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా దినోత్సవంనాడు పార్లమెంట్‌లో మహిళా ఎంపీలు మాత్రమే మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్టప్రతికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోక్‌సభలో చేసిన ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై మహిళాలోకం హర్షం వ్యక్తంచేస్తోంది. అయితే 16వ లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యంపై పెదవి విప్పితే ఈనాటికీ తలదించుకోవాల్సిన పరిస్థితే. గతంలో కంటే పరిస్థితి కాస్తంత మెరుగైనప్పటికీ లోక్‌సభలో 543మంది సభ్యులకు ఉండగా ఇందులో 61మంది మహిళా ఎంపీలు గెలిచారు. పశ్చిమ బెంగాల్ నుంచి అధికంగా ఉంది. 13మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 1999లో మహిళా ఎంపీలు 49మంది ఉండగా 2004నాటికి ఈ సంఖ్య 45కి పడిపోయింది. 1957లో కేవలం 27మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండేవారు. ఈసారి లోక్‌సభలో తొలిసారి మాట్లాడిన మహిళా ఎంపీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన డింపుల్ యాదవ్. ఆమె మహిళలు, పిల్లల సంక్షేమంపై మాట్లాడారు. ఈసారి లోక్‌సభ సజావుగా జరగటమే ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ మహిళాదినోత్సవంనాడు మహిళలకు మాట్లాడే అవకాశం వస్తే గత రెండు దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న మహిళారిజర్వేషన్ బిల్లు చర్చకు అవకాశం వస్తే బాగుండునని భావిస్తున్నారు.
అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మహిళల కోసం ఉద్దేశించిన దాదాపు 40 చట్టాలపై చర్చ జరగాలని ఆశిద్దాం.