సబ్ ఫీచర్

‘పండుటాకుల’ రంగుల పండుగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాథాశ్రమాల్లో జీవిత చరమాంకాన్ని గడుపుతున్న వృద్ధ వితంతువులు తొలిసారిగా ఆలయ ప్రాంగణంలో హోలీ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలను పంచుకున్నారు. శతాబ్దాల తరబడి కొనసాగుతున్న మతపరమైన కట్టుబాట్లను ఛేదించి, హోలీ నాడు వేలాదిమంది వితంతువులు బృందావనం (యుపి)లోని గోపీనాథ ఆలయంలో రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. బృందావనం, వారణాసితో పాటు పలు ప్రాంతాలకు చెందిన వితంతువులు గోపీనాథ ఆలయంలో హోలీ వేడుకలు జరుపుకునేందుకు ‘సులభ్ ఇంటర్నేషనల్’ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీరి కోసం 1,200 కిలోల రంగులను, 1,500 కిలోల గులాబీ రేకులను సమకూర్చారు. దేశంలో ఇప్పటికీ చాలా చోట్ల హోలీతో పాటు మతపరమైన పండుగల్లో వితంతువులను అనుమతించని సంప్రదాయం కొనసాగుతోంది. బృందావనంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా తమను ఆలయంలోకి అనుమతించి, హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడం పట్ల వృద్ధ వితంతువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరి జీవితం అనుభవిస్తున్న వృద్ధ మహిళలను జనజీవన స్రవంతిలో కలిపేందుకు మూడేళ్ల క్రితమే బృందావనంలోని అనాథాశ్రమాల్లో హోలీ సంబరాలను ‘సులభ్’ సంస్థ ప్రారంభించింది. ఈ ఏడాది మరో అడుగు ముందుకువేసి వారికి ఆలయ ప్రవేశం కల్పించింది.