సబ్ ఫీచర్

బోధన నదిలాంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన గలగల ప్రవహించే నది మాదిరిగా మారుతూ ఉంటుంది. అట్లా మారే బోధనే నికరంగా, సందర్భోచితంగా ఉంటుంది. పారిశ్రామికయుగం కన్నా ముందు మనం వ్యవసాయ రంగంలో ఉంటాము. కాబట్టి ఆ యుగం లక్షణాలు బోధనపైన కూడా సహజంగానే పడింది. వ్యవసాయంలో నారు పోయటం, నాటేయటం, కలుపులు తీయటం, దుక్కిదున్నటం, పంట నూర్చటం వీటిన్నింటి ప్రభావం తరగతి గదిలో బోధనపైన కూడా పడ్డది. కాబట్టే మనం ఆ యుగంలో అక్షరంనుంచి పదం. పదం నుంచి వాక్యం, వాక్యం నుంచి వ్యాసం, దానినుంచే ఆనాటి సాహిత్యం వచ్చింది. అదే పారిశ్రామిక యుగం వచ్చేవరకు పరిశ్రమలలోపల ఉత్పత్తిసాధనాల ప్రభావం, యంత్రాల ద్వారా పెద్దఎత్తున ఉత్పత్తిచేయటం దాని ప్రభావం బోధనపైన పడింది. అచ్చు యంత్రాన్ని కనుక్కోవటం, విషయాన్ని వౌఖికంగా జ్ఞప్తికి పెట్టుకోవలసిన అవసరం లేకపోవటం, అచ్చు యంత్రాల ద్వారా పుస్తకాల ద్వారా జ్ఞాన ఉత్పత్తికూడా మొదలయ్యింది. అది వేగవంతం అయ్యింది. 21వ శతాబ్దం వచ్చేవరకు విషయంకన్నా విషయ ఆలోచనల్లో మెదడులో జరిగిన ప్రక్రియలపైన బోధనపైన ప్రభావం పడింది. బోధన వేరు, విషయం వేరు. నైపుణ్యం వేరు అనే భావన వచ్చింది. అనగా సమాచార యుగం యొక్క ప్రభావం తరగతి బోధనపై కూడా బలంగా పడింది. పత్రికల్లో వార్త వేరు, వార్త యొక్క స్టోరీ వేరు. ఒకటే వార్తను ఒక్కొక్క విలేకరి ఒక్కొక్కరకంగా విశే్లషణ చేస్తారు. అదే మాదిరిగా పాఠం ఒకటే. కానీ ఆ పాఠాన్ని బోధించేటప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి దినం ఒక రకంగా వ్యక్తీకరణ చేస్తారు. ఆ పాఠం వినాలని పిల్లలు తరగతి గదికి పరుగెత్తుకు వస్తారు. విషయం కన్నా విశే్లషణ బోధనలో ఉపాధ్యాయుడు ఉపయోగించే భాష, వ్యక్తీకరణ చేసే పద్ధతులు, అందులో సమయాన్నిబట్టి హాస్యాన్ని జోడించటం, విద్యార్థుల్లో దాగివున్న అనే్వషణాశక్తిని లేపటం జరుగుతుంది. ఇవి బోధనకు కళ ఇచ్చేవి. అదే డిజిటల్ యుగం వచ్చేవరకు అక్షరం, వాక్యం ప్రధానం కాదు. భావనలు, ఆలోచనలు ప్రధానమైపోయాయి. ఒక భావన ఎలా వస్తుంది? భావనకు అక్షర జ్ఞానం అవసరం లేదు. ఇంద్రియాల పరిపక్వత ద్వారా మేధస్సులో భావన ఉత్పత్తిఅవుతుంది. భావనే బోధనకు ఇంధనం.
పిల్లల్లో ఇంద్రియాలు వికసించినప్పటినుంచే జ్ఞాన సముపార్జన జరగాలి. అందుకే కేజీ స్కూలునుంచే బోధనాప్రక్రియలో సమాజంలో జరిగే పరిణామాలే ప్రభావితం చేస్తాయి. ఏ ఉపాధ్యాయుడైతే ఈ పరిణామాల్లో ఈత కొడతాడో అతడు విద్యార్థుల మదిలో నిలువగలుగుతాడు. విద్యార్థి ఎన్నో ప్రశ్నలతో, భావనల్లో తరగతి గది గడపై కాలు పెడతాడు. ఇపుడు మానసిక శాస్తమ్రే మారిపోయింది. పిల్లల మెదళ్లు ఖాళీ కుండలు కావు. అది అమృత భాండాగారం. ఉపాధ్యాయుడు మారుతున్నటువంటి పరిణామాల్లో ప్రేరకుడు అయ్యాడు. బోధనకన్నా, అభ్యసనకు ప్రాధాన్యత పెరిగింది. డిజిటల్ యుగంలో గురువునుంచి తరగతి గది మారింది. ఈ యుగంలో బోధనకన్నా, అభ్యసన ముఖ్యమైనది. బోధన ప్రవహించే నీరు. అది ఎవరి సొత్తుకాదు. అందరి సొత్తు. సమాజ పరిణామాలే బోధనకు రుచి తీసుకువస్తాయి. బోధన అనేది ఒక సామాజిక ప్రక్రియ.

- చుక్కా రామయ్య