సబ్ ఫీచర్

జంగిల్ జిలేబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చు జిలేబీలా నోరూరించే ఈ జంగిల్ జిలేబీని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకోనివారు ఎవరుంటారు.వీటిలోని గుజ్జు గులాబీ, ఎరుపు రంగుల్లోనేకాక మంచు వెనె్నలలా తెల్లగా ఉంటుంది. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా, పొలం గట్లపై కనిపించే ‘సీమ చింతకాయ’ చెట్లు ఎలాంటి వాతావరణంలోనైనా మనగలుగుతాయి. వేడిని తట్టుకోగలగడం, ఎక్కువ రోజులు తాజాగా ఉండగలగడంతో సీమచింతకాయలు పట్టణ ప్రజలకు చేరువవుతున్నాయి.
సీమ చింతకాయలు పదినుంచి పనె్నండు సెంటీమీటర్ల పొడవుఉన్నా మణిహారంలా చుట్టుకుని ఉంటాయి. వేసవిలో నాలుగు నెలలపాటూ విరివిగా కాసే సీమ చింతకాయల్లో కావలసినన్ని పోషక విలువలు దాగున్నాయి. అలాగే ఔషధ గుణాలున్నాయి. అందుకే రుచికి, ఆరోగ్యానికి సీమ చింతకాయ అవసరమే అంటారు వైద్యులు. రుచికి తియ్యగా లేత కొబ్బరికి తీసిపోదు. కొన్ని ప్రాంతాల్లో వంటల్లోనూ వాడుకునే ఇవి సమృద్ధిగా నూనె, పీచు పదార్థాలు కలిగి ఉంటాయి. అతి తక్కువ కొవ్వుని కలిగిన వీటిలో మూడవవంతు వరకు ప్రోటీన్‌లు లభ్యమవుతాయి. విటమిన్ ఎ, బి1, బి2, బి6, సిలతోపాటూ పలు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. మందుల తయారీలోనూ వినియోగించే ఈ చెట్టు ఆకులు, బెరడు, కాయలు, గింజలు.. పంటి నొప్పులు, చిగుర్లలో రక్తం కారడం, కడుపులో అల్సర్‌లు నివారిస్తాయి. అలాగే శరీరంపై రక్తస్రావాలను అరికడతాయి. గర్భిణి స్ర్తిలు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. సాధారణంగానే రోగ నిరోధకశక్తిని పెంపొందించే సీమచింతకాయల్లో క్యాన్సర్‌ని ఎదుర్కోగల అనామ్లజనకాలు కూడా ఉన్నయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

- మురళీ