సబ్ ఫీచర్

పిల్లల మనసు తెలుసుకోండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రామారావు కొడుకు కిషోర్‌తో తిరగవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాన్రా..? వాడు ఎప్పుడూ చదువుసంధ్యల్ని పట్టించుకోకుండా రోడ్లమీద జులాయిగా తిరుగుతూ కనిపిస్తుంటాడు. అలాంటివాడితో నీకు స్నేహమేంట్రా..?’- అంటూ కామేష్‌ను మందలించాడు వాళ్ల నాన్న ప్రభాకరం.
‘అదేంటండీ.. అలా అంటారు..? కిషోర్ అలా కనిపిస్తాడు కానీ వాడికి మన అబ్బాయి కన్నా అన్ని సబ్జెక్టుల్లోనూ మార్కులు బాగానే వస్తున్నాయి. ఎప్పుడూ చదివినట్లే కనబడడు ఆ కుర్రాడు.. మన కామేష్ ఎప్పుడూ పుస్తకాలు వదలడు. అయినా కిషోర్ కంటే మనవాడికి తక్కువ మార్కులే వస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉందండీ’ అంది ప్రభాకరం భార్య సూర్యకళ.
***
పిల్లలైనా, పెద్దలైనా ఎవరి మనసులో ఏముందో స్పష్టంగా తెలుసుకోవడం కష్టం. పిల్లల మాటలు, ప్రవర్తనను బట్టి వాళ్ల ఆలోచనల్ని పూర్తిగా తెలుసుకోగలం అనుకుంటే పొరపాటే. ఎక్కువ అల్లరి చేసే పిల్లలు తల్లిదండ్రులను విసిగించినా శీఘ్రమైన గ్రాహ్యక శక్తి కల్గి చదువుల్లో రాణిస్తున్నపుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆకతాయిలా కనిపించే ఈ అల్లరి పిల్లాడు ఇంత బాగా ఎలా చదువుతున్నాడనిపిస్తుంది! చిన్నపిల్లల అంతరంగాన్ని తెలుసుకోవడం అంత సులువైన పనికాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తల్లిదండ్రులు, టీచర్లు కూడా వాళ్ల మనోభావాన్ని సులభంగా అవగతం చేసుకోలేరు. కొందరు పిల్లలైతే ఎపుడూ పెద్దగా చదివినట్లుగానీ, బాగా శ్రమపడినట్లుగాని, పుస్తకాలన్నీ ముందేసుకొని కూర్చున్నట్లు కూడా కనపడరు. అటువంటివారు అందరూ అబ్బురపడే విధంగా పరీక్షల్లో మంచి మార్కుల్ని సాధించడం, విద్యలో రాణించడం అక్కడక్కడా మనం గమనించవచ్చు. పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీపట్టేవాళ్ళకంటే ఒత్తిడికి లోనుకాకుండా యథాలాపంగా చదువు సాగించే పిల్లలు నిర్దేశిత లక్ష్యాలను సాధించడం విస్మయపరిచే విషయం. నిరంతరం చదివినా ఏకాగ్రత తక్కువగా కనబరిచే విద్యార్థుల కంటే- కొద్ది సేపు చదివినా శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నవాళ్లు రాణిస్తారు.
పిల్లల విషయంలో తల్లిదండ్రుల జోక్యం ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు కనిపించవు. పిల్లల కోరికలు, ఆలోచనలను అర్థం చేసుకోకుండా, వారి అభిరుచులకు భిన్నంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దితే మేలు కంటే కీడు జరిగే ప్రమాదం ఉంది. పిల్లలకు ఆసక్తి లేని కోర్సులో చేర్పించడం, చదవమని మితిమీరి ఒత్తిడి చేయడం చాలా చోట్ల మనం చూస్తుంటాం. తల్లిదండ్రుల అనాలోచిత నిర్ణయాల ఫలితంగా పిల్లలు చదువులో విఫలవౌతారు. పిల్లల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేయాలి. చాలామంది తల్లి