సబ్ ఫీచర్

నిద్రలో శ్వాస అందటం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురక పక్కవారికి శాపం అయితే, గురకతో నిద్రలో శ్వాస అందక ఉలికిపడి లేచేవారికి అది నరకం. అమెరికాలో ఓ భార్య తన భర్తతో విడాకులు కోరుతూ కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఎందుకు విడాకులని న్యాయమూర్తి అడిగితే దానికి కారణం తన భర్త పెట్టే గురక అని చెప్పింది. గత పదేళ్లుగా తనకి రాత్రిళ్లు నిద్రలేదని వాపోయింది. దీనికి ఆ న్యాయవాది విడాకులివ్వడం కుదరదని, ఆ భర్తకి గురకకి చికిత్స చెయ్యమని అక్కడి వైద్య సిబ్బందిని ఆదేశించాడు. పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది అతనిది కేవలం మామూలు గురక కాదని దానికన్నా ప్రమాదకరమైన డజఉఉ--ఉ అని తేల్చి చెప్పారు. అది విన్న అతని భార్య చాలా బాధపడింది. గురక కారణంగా నిద్రలేని తను అంత బాధపడితే, శ్వాస అందక నిద్రలేక గత పదేళ్లుగా తన భర్త ఎంత బాధపడ్డాడో అని తలచుకొని ఏడ్చింది.
రైలు కంపార్ట్‌మెంట్‌లో లేక రాత్రి నడిచే బస్సు వాహనాల్లో ఈ గురక తోటి ప్రయాణికులను ఎంత ఇబ్బందికి గురిచేస్తుందో మాత్రమే మనకి తెలుసు. శ్వాస పీల్చుకోవడానికి వారి శరీరం చేస్తున్న కష్టం ఎంతో తెలీదు. నిద్రలో ఉలిక్కిపడి లేచే ఆ ఘటనలు, సమస్త మానవాళి పడుకున్నపుడు వారు పడుకోవడానికి చేసే ప్రయత్నాలు, అది ఫలించక జాగారం చేసే వారి జీవితాలు, పొద్దున్న పని చేస్తూ చేస్తూ నిద్రలోకి జారుకుని దాని మూలంగా పోయిన వారి ఉద్యోగాలు, ఇవన్నీ వింటే మన కళ్లలో నీరు తిరుగుతుంది. కిందటివారం చెప్పినట్లుగా 30 శాతంలో ఇది కేవలం గురక మాత్రమే కాదు, అంతకుమించి వున్న ప్రమాదం, దానే్న SLEEPAPNE అంటారు.
SLEEPAPNEA అంటే?
నిద్రలో శ్వాస కోసం చేసే ప్రయత్నంలో పుట్టే శబ్దం పేరు గురక. ఈ ప్రయత్నం ఫలించకపోతే, శ్వాస ఊపిరితిత్తులనుంచి తగిన మోతాదులో శరీర భాగాలకు అందక రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి దాని కారణంగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి గాలి పీల్చుకోవడానికి చేసే తీవ్ర ప్రయత్నమే ఈ SLEEPAPNEA. రాత్రి సరిగ్గా నిద్రలేక పొద్దున పూట పనిచేస్తూ లేక చదువుతూ నిద్రపోవడం వారిలో మనం గమనించగలం. ప్రొద్దున్న లేవగానే తలనొప్పి, రక్తపోటు, గుండెకి సంబంధించిన జబ్బులు తీవ్ర బాధితుల్లో చూడొచ్చు.
దీన్ని ఎలా పరీక్షించడం?
దీనికి తగిన పరీక్షని SLEEP STUDY అని అంటారు. అంటే నిద్రలో చేసే పరీక్ష. వైద్య భాషలో చెప్పాలంటే POLYSOMNOGRAM. ఈ పరీక్ష చేసే లాబ్‌లకి రాత్రి వెళ్లి మనం ఇంట్లో రాత్రి ఎలా పడుకుంటామో అక్కడ లాబ్‌లో అలానే పడుకోవాలి. వాళ్లు కొన్ని యంత్రాలని మన శరీరానికి తగిలిస్తారు. రాత్రంతా మనం పడుకున్నపుడు ఆ యంత్రాలు మన ఆక్సిజన్ స్థాయిని రికార్డు చేస్తాయి. ఆక్సిజన్ స్థాయి ఓ పరిమితిని మించి తగ్గి ఉన్నట్టు ఫలితం వస్తే మనకి SLEEPAPNE ఉందని నిర్థారణ అవుతుంది. ఉందా లేదా అనే కాకుండా దాని తీవ్రత ఎంతో కూడా మనకీ పరీక్ష ద్వారా తెలుస్తుంది.
ఉంటే ఏం చెయ్యాలి?
మొదట థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ లోపాలవల్ల ఇది కలిగే అవకాశం వుంది. పరీక్షలో లోపం ఉంటే దానికి చికిత్స తీసుకోవాల్సి వుంటుంది.
థైరాయిడ్ పరీక్ష నార్మల్ ఉన్నవాళ్లు ఏం చెయ్యాలి?
థైరాయిడ్ పరీక్ష నార్మల్ వున్నా SLEEPAPNEA ఉన్నవాళ్లు సాధారణంగా లావుగా ఉంటారు. వీరు లావు తగ్గే ప్రయత్నం చెయ్యాలి. ఇది చాలామందిలో ఉపశమనం కలిగిస్తుంది. లావు తగ్గాక కూడా ఈ సమస్య ఉన్నవారు లేక కొద్దిగా -ఉ ఉన్నవారు (పరీక్షలో మన తీవ్రత ఎంతో తెలిసిపోతుంది. కొద్దిగా ఉందా, ఎక్కువగా ఉందా, తీవ్రంగా ఉందా అని) పళ్లకి సంబంధించిన పరికరాన్ని వాడాల్సి వుంటుంది. ఈ పరికరం పని చెయ్యకపోయినా లేక ఎక్కువగా ఉన్నవారు ఒక యంత్రాన్ని వాడాల్సి వుంటుంది. దానే్న CPAP అంటారు. మూతికో మాస్కు పెట్టుకుని ఆ మాస్కుని ఓ యంత్రానికి తగలిస్తే

అది జోరుగా మాస్కులోంచి గాలి పంపుతుంది.
అదే CPAP అంటే. కాని 50 శాతంలోనే ఇది పనిచేస్తుంది. మిగతావారు నిద్రలో ఈ యంత్రాన్ని తగుల్చుకొని పడుకోలేకో సరిగ్గా వాడలేకో దానివల్ల ప్రయోజనం పొందలేరు. వీరిలో కెమెరా ఉన్న గొట్టం ద్వారా శ్వాసకోశంలో ఎక్కడ వెడల్పు తక్కువుందో తెలుసుకొని అక్కడ ఆపరేషన్ చెయ్యడం ఉత్తమం. పై చెప్పినవి పని చెయ్యనపుడు లేక SLEEPAPNE తీవ్ర స్థాయిలో వున్నపుడు క్రింది మరియు పై దవడని కోసి ఒక 10 లేక 15 మిల్లీ మమీటర్లు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వైద్యశాస్త్రంలో SLEEPAPNEకి చిట్టచివరి సమాధానం ఇదే. దీనిలోని ప్రతికూలత ఏంటంటే దవడలని అంత ముందుకు తెచ్చిన తరువాత మన ముఖం రూపురేఖలు చాలా మారిపోతాయి. ముఖం అందవికారంగా కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాణంకన్నా అందం ఎక్కువ కాదు. బ్రతికి ఉండడమే అదీ ఆనందంగా ఉండడమే నిజమైన అందం, కాదంటారా? ఓసారి ఒక తల్లి తన రెండేళ్ల కొడుకు గురక పెడుతున్నాడని నా దగ్గరికి తెచ్చింది. నేను అందరి తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల్లో గురక సహజం. వారి టాన్సిల్స్ పెద్దగా వుండడంవల్ల అది గురకకి కారణం అవుతుంది. ఎదుగుదలతోపాటు టాన్సిల్స్ ప్రమాణం తగ్గుతుంది. గురక అదే పోతుంది. పదేళ్ల తరువాత కూడా గురక వుంటే అపుడు డాక్టర్‌కి చూపడం ఉత్తమం.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం faceclinics@gmail.com సెల్ నెం: 92995 59615