సబ్ ఫీచర్

మారుతున్న తరగతి ‘గది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ ప్రక్రియలో ఎన్ని పరిణామాలొచ్చాయో దానికన్న ఎక్కువగా పరిణామాలు తరగతి గదిలో వచ్చాయి. తరగతి గది అవసరాన్ని కొన్నివేల సంవత్సరాల క్రితం తపస్సుచేసే రుషులు గుర్తించారు. పసిపాపల్లో ఉన్నటువంటి ఆసక్తి తరగతి గదికి పునాది. విద్యార్థికి తనకు వచ్చి న అనుమానాలను తీర్చుకోవటానికి ఏడు సంవత్సరాలకే రుషుల దగ్గరకు పోవటం, గురుకులాల్లో జీవనం గడపటం, తన అనుమానాలను చర్చించటం జరిగేది. అదే తరగతి గదికి పునాది. సమాజంలో వచ్చినటువంటి పెత్తందారీ పోకడలే తరగతి గదిని కూడా హైజాక్ చేశాయి. పిల్లల ఆలోచనలకన్నా పెత్తందారీ వ్యవస్థకు ఇటుకలు పేర్చటానికై తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాము అనుకున్న ప్రణాళికలను నెరవేర్చటానికై అధ్యాపకులను నియమించటం సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు తమ కరికులమ్‌ను నూరిపోయటం జరిగింది. అదే పెట్టుబడిదారి వ్యవస్థ తరగతి గదిని తన చేతుల్లోకి తీసుకున్నది. ఆనాడు పాఠశాలల్లో ఏ కొద్దిమందో ఆ సాహిత్యాన్ని నేర్చుకుని ఆ సంబంధిత వ్యవస్థ నిర్మాణంలో కూలీలయ్యారు. జీవనోపాధికి విద్య అనే భావన వచ్చింది. తరగతి గదిలో అధ్యాపకుడికి పిల్లలకన్నా పాఠ్యప్రణాళికే ముఖ్యమైంది. కానీ విద్యార్థి తనకున్న ఆసక్తితో సమాజంతో ప్రశ్నలకు అదే పాఠ్యప్రణాళికలను ప్రశ్నించి తొలిచాడు. ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. పిల్లల సాంగత్యంవలన ఉపాధ్యాయుడు కూడా ఆ పాఠ్యప్రణాళికను తొలచటంలో భాగస్వామి అయ్యాడు. తరగతి గది ఒక వ్యవస్థకు దోహదపడుతుందని పెట్టుబడిదారి సమాజం ముందుగానే వూహించింది. విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ కలిసి జీవనోపాధికన్నా భవిష్యత్ సమాజ నిర్మాణానికి తరగతి సాధనమని, నూతన సమాజానికి ఆలోచనల ఇటుకలను అందించారు. ఈ ప్రయత్నాన్ని, లక్ష్యాన్ని మళ్లించేందుకు పెట్టుబడిదారి సమాజం పాఠ్యప్రణాళికను తన చేతిలో పెట్టుకుంది. యువతరానికి భోగవిలాసాల సమాజాన్ని చూపించి పెట్టుబడిదారి వ్యవస్థ ఎక్కువ మందిని ఆకర్షించింది. ఒకనాడు కొంతమందికే కొన్ని వర్గాలకే పరిమితమైన విద్య అన్నివర్గాల వారి కలయికతో తరగతి గది కిక్కిరిసిపోయింది. వౌలిక వసతుల కల్పనలు, సౌకర్యాలు పెరిగాయి. చివరకు మొత్తం విద్యారంగం మార్కెట్ శక్తుల చేతుల్లోకి పోయింది. తరగతి గది సంఖ్యను పెంచటానికై సాంకేతిక రంగం కూడా తోడ్పడింది. 40 మందితో ఉండే తరగతి గది 100 దాకా పోయింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. కాలకచ్చేరిలో వందల మందికి ఆ అనుభవం ఇవ్వగలిగినప్పుడు అదే పరిస్థితిని తరగతి గదిలో కూడా చేయవచ్చుననే ఆలోచన వచ్చింది. వాటినే ‘కాన్‌క్లాసెస్’ అంటారు. అమెరికా, యూరప్‌లలో వంద మందిని ఒక తరగతి గదిలో కూర్చోబెట్టి చదువు చెప్పవచ్చునని నిరూపించారు. దాన్నికూడా అధిగమించేందుకై స్టాన్‌ఫర్డ్‌లో వున్న కంప్యూటర్ అధిపతి చార్లెస్ ఎం.బెస్ట్ ఒకే తరగతి లోపల వేల మందిని కూడా పెట్టవచ్చునని ప్రతిపాదించారు. ఎం.ఐ.టి. ప్రొఫెసర్ ఎం.బెస్ట్, స్టాన్‌ఫర్డ్ సదార్షియన్ తురాన్‌లు 2000 మందికి ఒకే తరగతిలో అభ్యాసం చేయవచ్చునని చూపించారు. పెట్టుబడిదారి సమాజం వినియోగదారులను పెంచుతూ పోయింది. ఉపాధ్యాయుడు, విద్యార్థికి ఇదొక ఛాలెంజ్. ఈ ఇద్దరికి సామాజిక కర్తవ్యాలున్నాయి. విద్యార్థిలో వున్న ప్రొటెన్షియాలిటీ, అధ్యాపకునిలో వున్న సామాజిక కమిట్‌మెంట్ ఈ రెండూ కలిసి జ్ఞానాన్ని తరగతి గదినుంచి వెళ్లవలసి ఉన్నది. విద్యారంగంలో అధ్యాపకులైన విద్యార్థులయొక్క ఉమ్మడి ప్రయోజనమే సమాజ చక్రాలను కదిలించటానికి ఇంధనం కావాల్సి ఉంది. తరగతి గది నేచర్, విలువలు, కాంపోజిషన్ మారుతున్నాయి. తరగతి గది కంట్రోలింగ్ ఏజెన్సీ మారుతున్నది. 21వ శతాబ్దం ఛాలెంజ్‌లో తరగతి గది తన కర్తవ్యాన్ని ఎలా పాటిస్తుందో చూడాలి. తరగతి గది ముఖచిత్రమే మారింది.

- చుక్కా రామయ్య