సబ్ ఫీచర్

పునరుత్పాదక ఇంధనాలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణ మార్పు ప్రమాదకరంగా మారింది.. మన విద్యుత్ రంగం, పరిశ్రమలు, రవాణా రంగం బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు లాంటి ఇంధనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనివలన వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు ఎక్కువై భూతాపానికి దారితీస్తున్నది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో 70 శాతం శిలాజ ఇంధనాల నుంచి వస్తున్నది. శిలాజ ఇంధనాల తరుగుదలవల్ల మనం పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వుంది. ఇవి తక్కువ ఖర్చుతోనే సమకూర్చుకొనవచ్చు. పర్యావరణానికి ఎటువంటి హాని వుండదు.
మన దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2015లో ఇవి రూ.72,600 కోట్లుగా అంచనా. 2030నాటికి ఈ రంగం వాటా 40 శాతానికి పెంచాలని ప్రభుత్వం ఆశిస్తున్నది.
మన దేశం సౌరశక్తిపై ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. ఒక అంచనా ప్రకారం 2100 నాటికి బొగ్గు ఆథారిత విద్యుత్ ఉత్పత్తి వుండదు. సుమారు 60 శాతం విద్యుత్తు సౌరశక్తి ఆథారితమవుతుంది.
ఈ పరిస్థితులలో బొగ్గు వినియోగం బాగా ఆదాచేసి, సౌరశక్తి పవనశక్తి, జల స్థితిజ శక్తిపై మనం ఆధారపడాలి. ప్రస్తుతం ప్రభుత్వం భవనాల కప్పులపై ఏర్పరచే సౌరశక్తికి సబ్సిడీ ఇస్తున్నది. పవనశక్తిని వినియోగించుకోవడానికి కృషి జరుగుతున్నది. 2015-16లో అదనంగా 3,472 మెగావాట్లు పవనశక్తి ఏర్పడింది. ఈ విషయంలో తమిళనాడు అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. మొత్తంమీద పరిస్థితి ఆశాజనకంగానే వుంది. అదనంగా ఏర్పడిన పునరుత్పాదక ఇంధనంలో వాయుశక్తి వాటా 60 శాతం వరకు వుంది. 2030 నాటికి సౌర, పవన మొత్తం ఇంధనం, 350 గిగా వాట్లు వుండవచ్చు. దీనిలో సౌరశక్తి వాటా 250 గిగా వాట్లు (లక్ష మెగావాట్లు = 100 గిగా వాట్లు).
వ్యర్థ పదార్థాల నుండి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. మన దేశంలో రోజుకి 1.34 లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. పునరుత్పత్తికి ఉపయోగించే వాటిని వినియోగిస్తే, 1,033 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇ-వ్యర్థాలలో 2.5 శాతం మాత్రమే పునరుత్పత్తికి వాడుతున్నాం. మనకి జంతు సంపద బాగానే వుంది. అందువల్ల బయోగ్యాస్ ఉత్పత్తిలో శ్రద్ధ చూపాలి.
పునరుత్పత్తి ఇంధన రంగాన్ని, పటిష్ఠం చేయడంలో కొన్ని సమస్యలున్నాయి. పెట్టుబడిదారులు వెనకాడుతున్నారు. ప్రాజెక్టులను ప్రారంభించడంలో జాప్యం జరుగుతున్నది.
సౌరశక్తి తక్కువ ఖర్చుతో లభించినా మొదట్లో పెట్టుబడి హెచ్చు స్థాయిలో వుంటుంది. ఎన్ని సమస్యలున్నా పునరుత్పాదక ఇంధన రంగానికి కావలసిన ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇప్పుడు కాస్త కష్టపడితే, భవిష్యత్‌లో సమస్యలు వుండవు.
విద్యుత్ రంగానికి ఎక్కువ సబ్సిడీలు ఇచ్చినా విద్యుత్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం వుంది. మోటార్లను విపరీతంగా వాడటంవల్ల భూగర్భ జలాలు ప్రమాద స్థాయిని చేరుకున్నాయి. నీటి ఆధారిత పంటలకు (చెరకు, వరి, గోధుమ) అధిక ప్రాధాన్యత ఇవ్వడంవల్ల విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. ఈ కారణంగా ఇంధన వనరులను ఆదా చేయడం కూడా ముఖ్యమే.
విద్యుత్ డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోతే అన్ని రంగాల్లో అభివృద్ధి దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రగతికోసం కృషి చేస్తున్న నాయకులు, వౌలిక వసతులు, ఇంధన సమృద్ధి కోసం తగిన ప్రణాళికలు రచించి అమలు పరచాలి. అప్పుడు మాత్రమే సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు పునరుత్పాదక ఇంధన వనరుల వినయోగమే పరిష్కారం.

- డా.ఇమ్మానేని సత్యసుందరం