సబ్ ఫీచర్

పాఠానికి ప్రేరకులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయుడనే వ్యక్తికి ప్రతిరోజు కొత్తే. ప్రతిరోజు ఒక నూతన సూర్యోదయం. అది కాదనుకునేవాడికి ఇది అరిగిన పాఠం. లేదనుకుంటే అది అయిపోయిన పాఠం. అమెరికన్ అధ్యక్షుడు ఐరన్ ఓవర్ ఒకసారి ఇలా అన్నాడు. ‘‘ఉపాధ్యాయులకై నిరంతరం శోధన జరుగుతూనే ఉండాలి.’’ తరగతి గదికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థి పరీక్షకు వెళుతున్నట్లు ఉంటుంది. పరీక్షకుపోయే విద్యార్థికి ఏమి జ్ఞప్తికి రాదు. అప్పుడు భయపడుతుంటాడు. సంవత్సరం సొంతం చదివినా కానీ పరీక్షలప్పుడు అంతా జ్ఞప్తికి రావటం లేదని అనుకుంటాడు. అదే సమయంలో పిల్లలకు ధైర్యం చెప్పాలి. ‘‘పిల్లలూ! జీవితంలో సాధించిన విజయాలు ఒక్కసారి స్మరించుకొమ్మని చెప్పాలి’’. పరీక్ష హాలుకు వచ్చిన తర్వాత ఇచ్చిన పేపరు చూస్తాడు. ఎప్పుడు ఎక్కడనుంచి జ్ఞానం ప్రవహిస్తుందో వెతుక్కుంటాడు. అది నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అదే మాదిరిగా ఉపాధ్యాయుడు పోయినప్పుడు ఎంత చదివినా ఏమీ ఒక్కొక్కప్పుడు జ్ఞాపకాలు రావు. తరగతి గదిలోకి రాగానే పిల్లలను చూడగానే వూట మాదిరిగా ఎక్కడినుంచో ప్రశ్నలు బయలుదేరుతాయి. చెప్పబోయే పాఠానికి ఉగాది పచ్చడిగా ఎన్నో కోణాలను ప్రశ్నల ద్వారా చూపిస్తాడు.
పిల్లల ఉత్సాహమే పాఠానికి ప్రాతిపదిక అవుతాయి. జ్ఞాన వెతుకులాట మొదలవుతుంది. పాఠం బోధన మొదలవుతుంది. బోధనో ఒక్కొక్క జ్ఞాన పొరలను కదిలిస్తుంది. ఉపాధ్యాయుడు తయారుచేసుకున్న ప్రణాళిక అతని మేధస్సులో మెరుస్తుంది. తనకున్న చాతుర్యంతో ఒక్కొక్క కానె్సప్ట్‌ను పిల్లల మెదళ్లకు చేరుస్తాడు. పిల్లలు ప్రశ్నలు అడుగుతున్న కొద్ది పాఠానికి కొత్త రుచి వస్తుంది. తాను తయారుచేసుకున్న ప్రణాళికను, పాఠ్యాంశాన్ని పిల్లలకు చెప్పటం కాదు. ఉపాధ్యాయుని మెదడులో పాఠం ఉంటుంది. పిల్లలు సమిధలు వేసినా కొద్ది అది ఒక్కొక్క జ్వాలగా తరగతి గదిలో కనిపిస్తుంది. పాఠం చెప్పేటప్పుడు బి.ఇడిలో నేర్చుకున్నటువంటి పద్ధతులు లేక తమలో దాగివున్న నైపుణ్యం కనపడకుండానే అతన్ని గైడ్ చేస్తూ ఉంటాయి.ఉపాధ్యాయుడిలో వున్న సహజమైన లక్షణాలు కొన్నిసార్లు పిల్లలను నవ్విస్తాయి. కొన్నిసార్లు కవ్విస్తాయి. పాఠం చెప్పటం అయిపోయిన తర్వాత టీచర్‌కు అనుమానం వస్తుంది. ఇంతవరకు చేసిన పని ఎంతవరకు పిల్లలకు లాభమయ్యిందో ఆలోచిస్తాడు. తనకుతాను అడ్జెస్ట్‌మెంటు చేసుకుంటాడు. తను ప్రశ్నలడుగుతాడు. అనుకున్నదానికన్నా పిల్లల నుంచి సమాధానాలు వచ్చాక ఉపాధ్యాయుడు ఆనందం పొందుతాడు. తాను చెప్పిన పాఠం పిల్లలు చక్కగా అవగాహన చేసుకున్నారన్న సంతృప్తిని పొందుతాడు. తాను అంతగా కష్టపడినందుకు వచ్చిన ఫలితానికి తనకు తానే మురిసిపోతాడు. అటువంటి ఉపాధ్యాయుని చేతిలో తయారైన పిల్లలు రత్నాల వలె వెలిగిపోతారు. నిజమైన భావి భారత పౌరులుగా నిలిచివెలుగుతారు. అటువంటి ఫలితాలు సాధించినప్పుడే ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసినట్టు. తన చేతిలో తయారైన విద్యార్థి భవిష్య త్తులో ఉన్నత స్థానంలో ఉంటే సంతోషించేది మొదట గురువు మాత్రమే. ఆ ఆనందంలో ఎటువంటి స్వార్థం ఉండదు. కేవలం వెలుగు మాత్రమే.
పిల్లలు వేసే ప్రశ్నలతో నిత్యం పాఠం మొదలవుతుంది. టీచర్ ఇచ్చే ప్రశ్నలతో గంట కొడుతుంది. పిరియడ్ అయిపోతుంది. తరగతి గదిలోకి భయం భయంగా అడుగుపెట్టిన టీచర్ నవ్వుకుంటూ బయటపడుతాడు. పాఠానికి ప్రేరకుడెవరో ఇప్పుడు చెప్పండి.

- చుక్కా రామయ్య