సబ్ ఫీచర్

నీతి అయోగ్ పేదరికాన్ని రూపుమాపేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో జనాభా దాదాపు 124 కోట్లకు చేరుకొంది. ధనవంతులు మరింత ధనవంతులు కావడం తప్ప, దశాబ్దాలుగా పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు. వారు అభివృద్ధి దిశగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు వారికి ఏమాత్రం చేయూతనందించలేక పోతున్నాయి. ఉపాధి అవకాశాలు కుంటుపడడం, సామాజిక రంగాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం, పథకాలు లక్షిత లబ్ధిదారులకు అందక పోవడం, పథకాల అమలుపై సక్రమమైన అజమాయిషీ లేకపోవడంతో పథకాలు నీరుగారిపోతున్నాయి.
దశాబ్దాలుగా జనాభాలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి గణాంకాలను నిర్దిష్టంగా చెప్పలేని దుస్థితి. అవసరానికి అధికారులు కాకిలెక్కల్ని వేసి చూపడమే కానీ శాస్ర్తియ ప్రమాణాలతో రుజువు పరిచే వీలులేని స్థితిలో ఎంతమంచి పథకాలైనా చతికిలపడుతున్నాయని పాలక శ్రేణులకు ఇప్పుడిప్పుడే గుర్తుకురావడంతో, పేదరిక నిర్మూలన గురించి ఇప్పుడు కొత్త కోణంలో ఆలోచనలు మొదలయ్యాయి. అందులో నీతి ఆయోగ్ పథకంపై కేంద్రం రాష్ట్రాలతో పదే పదే సంప్రదించి పథకం పకడ్బందీగా అమలుచేయడానికి రాష్ట్రాలు కృతనిశ్చయంతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపునిచ్చారు.
నిర్భాగ్యుల పేరుతో కొన్ని కార్యక్రమాలను అమలుచేసి చేతులు దులిపేసుకొంటే పేదరిక నిర్మూలన జరగదు. లబ్దిదారులకు ఉపాధి అవకాశాలను అందుబాటులో ఉండాలి. వాటి ద్వారా సముచిత వేతనాలు లభించాలి. ఉపాధి అవకాశంతోచేతికి డబ్బులు అందితే సామాన్యులు కూడా పౌష్ఠికాహారం తినగలిగే స్థితిలో ఉండి పేదలు కూడా ఆరోగ్యవంతమైన జీవనం గడిపే వీలుంటుంది. అంతేకాకుండా ఉపాధి లబ్దిదారులు నైపుణ్యాలను అందిపుచ్చుకోగలిగితే మరింత ఆదాయం సమకూరుతుంది.
సామాజిక రంగాలపై ప్రభుత్వాలు నిధులు భారీగా కేటాయించి, వాటిని లక్షిత వర్గాలకు సత్వరం అందేలా అనువైన క్రమబద్ధమైన పద్ధతుల్ని అనుసరించాలి. ఈ విధానం చక్కగా అమలుపరిస్తే ఆసుపత్రులు, పాఠశాలల వంటివి పేద ప్రజానీకానికి అందుబాటులోకి వస్తాయి. పేదల్లో ఎక్కువమంది గ్రామాల్లోనే ఉన్నారు. వ్యవసాయం సజావుగా సాగితే రైతులు బతుకులు పచ్చగా ఉంటాయి. రైతులు కూడా పరిమిత నీటి వనరులతో పంట సాగుచేసే మెళుకువలను తెలుసుకొని ఆమేరకు సేద్య రంగాన్ని కొనసాగించాలి. సాగునీటి వనరులను సమీకరించే ప్రాజెక్టుల నిర్మాణాలలో వీలైనంతగా అవినీతిని తగ్గించేందుకు నిఘా రంగాన్ని అప్రమత్తంచేసి, నైపుణ్యతతో కూడిన ఇంజనీరింగ్ అధికారుల నిరంతర పర్యవేక్షణతో నాణ్యతగల ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి.
జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం ఏటా భారీగా నిధులు విడుదల చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమపద్ధతిలో వాటిని వినియోగించక పోవడం, పనులలో అవకతవకలు భారీగా వెల్లువెత్తుతూ నిధులకు గండికొడుతున్నాయి. ఉపాధి హామీ పథకంవల్ల పంట సాగుచేసే రైతులకు కూలీల సమస్య తీవ్రంగా ఉంటోంది. జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం ఏటా భారీగా నిధులు వినియోగిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. రైతు పంట సాగుకు వ్యవసాయ కూలీలకు అవినాభావ సంబంధం ఉంది. ఉపాధి హామీ పథకంతో ఆ సంబంధాలు విచ్ఛిన్నమై ఉపాధి హామీపై వ్యవసాయ కార్మికులు మొగ్గుచూపడం, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంవల్ల రైతాంగం సాగు సేద్యానికి స్వస్తిపలికి పంట విరామానికి మొగ్గుచూపుతున్నారు. అసలే పంట సాగు ఉత్పత్తిలో లాభాలమాట అటుంచి, చేసిన శ్రమ కూడా దక్కకపోవడంతో పంట సాగుకంటే పట్టణాలకు వలస బాట పట్టి కాయకష్టం చేసుకోవడానికి చిన్నసన్న మధ్యతరగతి రైతులు పట్టణాలవైపు వలస బాట పట్టారు.
ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితుల్లో పంట సాగు ఏటేటా లాభదాయకం కాకపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద సాగు వ్యయంకోసం చేసిన అప్పులు, వడ్డీలతో సహా తడిసి మోపెడయి, బాకీలు చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే నగ్నసత్యం పాలకులకు కూడా ఎరికే.
ఉపాధి హామీ పథకం నిధులు ఎందుకు కొరగాకుండా పోతున్నాయనే విజ్ఞుల ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకొని ఉపాధి హామీ పథకాన్ని రైతు కమతానికి కూడా విస్తరింపజేయగలిగితే ఫలితం ఉభయ తారకంగా ఉంటుందన్న ఆలోచన తెరపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్‌పై దృష్టి సారించింది. పొలంలో పనిచేసే కూలీకి 75శాతం సొమ్ము రైతు చెల్లిస్తే, మిగతా 25 శాతం మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వమే చెల్లించడం కొత్త ప్రతిపాదనలోని ప్రధాన అంశం. దీనివల్ల కార్మికుడికి చేతినిండా పని దొరుకుతుంది.
అయితే ఈ ప్రజాస్వామిక దేశంలో నిష్కళంకమైన ఎన్ని ప్రజాప్రయోగపథకాలు చేపట్టినా అవి అక్రమార్కులకు సంపదను చేకూర్చే పథకాలుగా మారకుండా క్రమబద్ధంగా పథకాల్ని అమలుజరిపే నైతిక బాధ్యత ప్రభుత్వాలకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్పత్తిదారుల సంస్థలు, మార్కెటింగ్ సంస్థలకు, రైతులు, స్వయం సహాయక సంఘాలను పెద్దసంఖ్యలో అనుసంధానం చేయడంవల్ల సత్ఫలితాల్ని రాబట్టవచ్చని నీతి అయోగ్ గుర్తించింది. పేదరికం అంచనాలపై గత కమిటీల మాదిరి గాడి తప్పకుండా, నీతి ఆయోగ్ కార్యదళం రాష్ట్రాలకు ఉపయోగపడే సిఫార్సులు చేయాల్సి ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి