సబ్ ఫీచర్

పంటి నొప్పికి రూట్ కెనాల్‌తో సాంత్వన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫంటినొప్పి ఎంత ఘోరమో అనుభవించినవాడికి తెలుస్తుంది. ఒకప్పుడు పన్ను నొప్పెడితే తీసేసేవారు. అది అప్పటి వైద్యం. కాలంతోపాటు ఇప్పుడు చికిత్సా విధానం కూడా మారింది. తియ్యడం చాలా అరుదు. నొప్పెడితే ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి దాన్ని కాపాడుతున్నారు. పంటి బాధితునికి వరంలా ఈ రూట్ కెనాల్ చికిత్స.
అసలు రూట్ కెనాల్ అంటే?
రూట్ కెనాల్ ఎంటో తెలియాలంటే ముందు పంటి అనాటమీ తెలుసుకోవాలి. పంటి అవతల భాగాన్ని ఎనామిల్ అంటారు, దానిలోని భాగాన్ని డెంటిన్ అంటారు. డెంటిన్‌లోపల పంటికి సంబంధించిన నరం ఉంటుంది. ఎప్పుడైతే ఎనామిల్ తొలగి లోని డెంటిన్ బయటికి కనబడుతుందో అపుడు చల్లవి కానీ వేడివి కానీ త్రాగినపుడు అవి డెంటిన్‌కి తాకి ‘జిల్’(సెన్సివిటీ) అనే సలుపుకి కారణం అవుతుంది. పుచ్చు ఎనామిల్, డెంటిన్‌ని దాటి పంటి నరాన్ని తాకినా లేక డెంటిన్‌కూడా తొలచి లోని పంటి నరం బయటికి కనిపించినా అప్పుడు పన్నులో విపరీతమైన పోటు పెడుతుంది. ఏదైనా కొరికేటప్పుడు నొప్పి భరించలేనంతదిగా మారి చెవిలోకి, తలదాకా పాకుతుంది. ఇంత నొప్పైన పంటికి మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాయి. వీటికి శాశ్వత విరుగుడు పన్ను తీసేయడం లేకపోతే రూట్ కెనాల్ చికిత్స.
పన్నుని రెండు భాగాల క్రింద విభజిస్తారు. బయటికి కనిపించే పన్నుని క్రౌన్ అంటారు. చిగురు, ఎముకలో దాగుండే దాన్ని రూట్ అంటారు. ఈ రూట్ ఎముకలో చాలా పొడుగ్గా వుంటుంది. ఈ పంటి నరం క్రౌన్ భాగం మధ్యలో మొదలై రూట్ చివరిదాకా ఉంటుంది. రూట్‌కెనాల్ చికిత్సలో ఒక చిన్ని రంధ్రం పన్నులో చేసి ఈ పంటి నొప్పికి కారణమైన నరాన్ని పూర్తిగా (క్రౌన్ మరియు రూట్ భాగాలనించి) తీసేస్తారు. అప్పుడు పన్ను నిర్జీవం అయిపోతుంది. ఇంక అది నొప్పి పెట్టదు. ఈ నరం తీసిన చోటుని ఖాళీగా వదిలేస్తే క్రిములు పెరగడానికి అవకాశం వుంటుంది. అందుకే ఆ ఖాళీ స్థలా న్ని ఒక పదార్థంతో నింపేస్తారు. ఇదే రూట్‌కెనాల్ అంటే.
రూట్‌కెనాల్ చేసిన పన్నుకి కృత్రిమ పన్ను తొడగాలంటారు, నిజమేనా?
నిజమే. పన్ను నిర్జీవమయ్యాక దానికి అంత బలం ఉండదు. గట్టి పదార్థాలు కొరికినపుడు రూట్‌కెనాల్ చేసిన పన్ను విరిగిపోయే ప్రమాదం వుంటుంది. అందుకే రూట్‌కెనాల్ చేసిన పన్నుని 1 నుంచి 2 మిల్లీ మీటర్లు అన్ని కోణాల్లో తగ్గించి ఆ తగ్గించిన స్థలంలో కృత్రిమ పన్నుని తొడిగిస్తారు. ఈ కృత్రిమ పన్నుని సరిగ్గా కాపాడుకుంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాతమరో కృత్రిమ పన్ను తొడిగించు కోవాల్సి ఉంటుంది.
ఈ చికిత్స బాగా నొప్పితో కూడుకున్నదంటారా?
అసలు కాదు. చిగుర్లో మత్తు మందు సూది ద్వారా ఇచ్చి ఈ రూట్ కెనాల్ చేస్తారు. సూది పొడిచేప్పుడు చీమ కుట్టినంత నొప్పి ఉంటుంది. రూట్ కెనాల్ చేసేటప్పుడు ఏ నొప్పి ఉండదు.
ఎన్ని రోజులు పడుతుంది ?
పదేళ్ల ముందు మూడు నుంచి పది రోజులు పట్టేది. ఇప్పుడు మాత్రం ఒక గంట సమయం పడుతుంది. దీనిని ఎండోరోటరీ రూట్ కెనాల్ అంటారు. ఇది ఒక గంటలో అయిపోతుంది. సాధారణ రీతిలో చేసే రూట్‌కెనాల్ కంటే ఇందులో నొప్పి చాలా తక్కువ. సాధారణ రీతిలో చేస్తే మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది.
అన్ని సందర్భాలలో ఈ ఎండో థెరఫీ చెయ్యగలమా?
పంటిలో చీము బాగా ఉన్నప్పుడు ఒకేసారిలో రూట్‌కెనాల్ ముగించడం కుదరదు. రెండు నుంచి నాలుగు రోజుల్లో ఆ చీమంతా బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ముగించే ప్రయత్నం చేస్తాం. అందరిలోనూ అన్ని సందర్భాలలోను ఎండోరోటరీ రూట్ కెనాల్ చెయ్యచ్చు. కానీ పై చెప్పిన సందర్భంలో మాత్రం ఎండోరోటరీ రూట్‌కెనాల్ చేసినా అది ఒకే ప్రయత్నంలో పూర్తిచెయ్యలేం.
కొన్నిసార్లు రూట్‌కెనాల్ చేసినా నొప్పి వస్తుందా?
అవును. రూట్‌కెనాల్ సరిగా చెయ్యకపోతే వారిలో నొప్పి మళ్లీ వస్తుంది. సరిగ్గా చెయ్యకపోవడం అంటే పంటి నరం మొత్తాన్ని తియ్యకుండా కొంచెం భాగాన్ని వదిలేయడం, ఖాళీ స్థలాన్ని సరిగ్గా నింపలేకపోవడం. రూట్‌కెనాల్ చేసినా నొప్పి ఉన్న పంటికి ఓ ఎక్స్‌రే తీసి సమస్య తెలుసుకొని తిరిగి రూట్ కెనాల్ చెయ్యాల్సి వుంటుంది.
ఎన్ని రోజులకి కృత్రిమ పన్ను పెట్టించుకోవాలి?
దీనికి ఇంత సమయం అంటూ లేదు. ఎంత తొందరగా పెట్టించుకుంటే అంత మంచిది. మా క్లీనిక్‌లో రూట్‌కెనాల్ అయిన మూడో రోజు పంటి ప్రమాణము తగ్గించి అయిదు లేక ఆరో రోజున కృత్రిమ పన్నుని సిమెంట్ ద్వారా తొడిగిస్తాం.
ఫెయిలయిన సందర్భాలు ఉన్నాయా?
ఖచ్చితంగా ఉన్నాయి కానీ దీని శాతం 2-3 శాతం వరకే. రీ రూట్‌కెనాల్ చేసిన కొందరిలో నొప్పి తగ్గదు, సమస్య ఏంటో కనబడదు. వీరిలో ఆ పంటిని తీసేస్తాం. దంత వైద్యునికి, పంటి బాధితుడికి అనుసంధానమైన చికిత్స ఈ రూట్ కెనాల్ చికిత్స. జంతికలు కొరకాలన్నా, మాంసం ముక్కల్ని నమలానన్నా అది పంటికి మాత్రమే సాధ్యం. వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి.

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615