సబ్ ఫీచర్

కుంగదీసే దురలవాటు (నేడు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవాళిని, ముఖ్యంగా యువతను శారీరకంగా, మానసికంగా మరియు ఆరోగ్యపరంగా కృంగదీస్తున్న మాదక ద్రవ్యాల దురలవాటుతోపాటు వాటి అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేసే సదుద్దేశంతో ‘ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం’ ‘నేతృత్వంలో డిసెంబర్ 1987లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల తీర్మానం ప్రకారం ప్రతియేటా 26 జూన్ రోజు ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ వ్యాపార వ్యతిరేక దినం’ జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా ప్రజలు (ముఖ్యంగా యువత, కూలీలు) వీటి వ్యసనంవల్ల తమ భవిష్యత్తును నాశనం చేసుకొనుటతోపాటు నేర ప్రవృత్తిని పోషిస్తూ శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్నారు. ఈ దురలవాటు కారణంగా మన దేశంలో ప్రతిరోజు పది మందికి పైగా మరణించడం విచారకరం. మాదక ద్రవ్యాలను ముఖ్యంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. మార్ఫీన్ (హెరాయిన్, బ్రౌన్‌షుగర్), కన్నాబిస్ (్ఛరస్, భంగ్, గంజా), ఓపియం (నల్లమందు), కొకేన్ (కోకా ఆకుల ఉత్పన్నము), బార్బిట్యురేట్లు, హిశిష్, బెంజోడయాజీఫైన్స్, మిథాఖ్వలోన్స్, ఆంఫిటమిన్స్.
మాదకద్రవ్యాలు దుర్వ్యసనపరులను శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కృంగిపోయేలా చేసి మానవాళి ఆరోగ్యాన్ని ప్రమాదపుటంచున నిలుపుతున్నాయి. చట్టవ్యతిరేక అలవాట్ల మూలంగా యువతపై వీటి దుష్ప్రభావం దీర్ఘకాలం పనిచేసి అవాంఛనీయ వ్యక్తిత్వ మార్పులకు దారితీస్తున్నాయి. విచ్చలవిడి వినియోగ ఫలితంగా ఈ క్రింది దుష్ఫలితాలు కలుగుతాయి. హెచ్‌ఐవి- ఎయిడ్స్ వ్యాప్తి, వాహన ప్రమాదాలు, ఆత్మహత్యలు, బాలికలపై అత్యాచారాలు, గృహహింస, మానభంగాలు, దొంగతనాలు, హత్యలు, ప్రవర్తనలో అవాంఛనీయ మార్పులు, మానసిక ఆందోళనలు, అతి నిరుత్సాహము, అవాంఛనీయ కోరికలు. వీటి మూలంగా కేంద్ర నాడీమండలం ప్రభావితం చేయబడి పలు దుష్ఫలితాలు కలుగుతాయి.
తక్షణ కర్తవ్యం: జూన్ 26రోజు పలు కార్యక్రమాలు రూపొందించుకొని యుఎన్ సభ్యదేశాలు వీటికి వ్యతిరేకంగా పెద్దఎత్తున సమరం చేయ నడుం బిగించాలి. ముఖ్యంగామాదకద్రవ్యాల వాడకం ద్వారా జరిగే నష్టాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. వీటి వాడకాన్ని, అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి. యువత ద్వారా వీటిపట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలి. వీటి వాడకాన్ని వ్యతిరేకించడం ద్వారా సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి. మన జాతి సంస్కృతీ వారసత్వాలను బహుళ ప్రచారం చేయాలి. దీర్ఘకాలిక కార్యక్రమాల రూపకల్పనతో వీటి వాడకాన్ని తగ్గించాలి. చట్టాలను కఠినంగా అమలుచేస్తూ వీటి వాడకాన్ని, అక్రమ వ్యాపారాన్ని నిరోధించాలి.
చికిత్సా మార్గాలు: మానసిక వైద్యులతో చికిత్స, ధ్యానము- యోగాల అభ్యాసం, వ్యసనపరులకు ధైర్యాన్ని కల్పించడం. నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమరవాణా ద్వారా స్మగ్లర్లు కోట్ల రూపాయలు చీకటి మార్గాల్లో సంపాదిస్తున్నారు. ప్రభుత్వాలు, పౌరులు ఏకమై మాదకద్రవ్యాలు లేని సమాజ స్థాపనకు కృషిచేసిననాడు ఆరోగ్యకర భారతం నిర్మించబడుతుంది.
* మాదకద్రవ్యాల పట్ల యుద్ధాన్ని ప్రకటిద్దాం
* యువతను సన్మార్గంలో నడిపేందుకు ఉపక్రమిద్దాం
* దురలవాట్లులేని భారతాన్ని స్థాపించేందుకు ప్రతినబూనుదాం.

- డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి