సబ్ ఫీచర్

అన్నకు తమ్ముడే ఆలంబన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిటివాడినైతేనేమి తోడు గా తమ్ముడు ఉన్నాడు కదా! ఎలాంటి విజయాన్నై నా సొం తం చేసుకుంటానంటున్నాడు కృష్ణకుమార్ పండిట్. అవిటితనం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా...పేదరికంతో పస్తులుండాల్సినా...పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఒకరికిఒకరు ఆలంబనగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సోదరులు. ఇద్దరూ ఐఐటిలో ర్యాంకులు సాధించి ఇంజినీరింగ్ చదువుతున్నారు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ కంప్యూటర్ ఇంజీనీర్‌గా స్థిరపడాలనుకుంటున్నాడు కృష్ణకుమార్ పండిట్.
బీహార్‌లోని సంస్థిపూర్‌లోని పరోరియా అనే కుగ్రామం. మదన్ పండిట్‌కు ఇద్దరు కుమారులు. కృష్ణకుమార్ పండిట్(19)కు ఆరునెలల వయసులోనే పోలియో సోకి కాలు చచ్చుబడిపోయింది. తరువాత పుట్టిన బసంత్ కుమార్ (18) తనవలే తన సోదరుడు ఆడుకోలేకపోతున్న విషయాన్ని గమనించి పసిప్రాయం నుంచే అన్నకు అండగా నిలిచాడు. భూమిని నమ్ముకున్న మదన్ పండిట్ ఉన్న కొద్దిపాటి పొలంలోనే పంట పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మిగతా పిల్లల వలే కొట్లాడుకోకుండా కుమారులిద్దరూ కలిసిమెలిసి ఉండటాన్ని గమనించిన ఆయన తన శక్తిమేరకు వారిని చదివించటానికే ప్రయత్నించాడు. చిన్నప్పటి నుంచి బసంత్ అవిటివాడైన తన సోదరుడ్ని భుజాల మీద వేసుకుని స్కూలుకు తీసుకువెళ్లేవాడు. ఇంజనీర్లు అవ్వాలనే లక్ష్యంతో సోదరులిద్దరూ కూడా ఐఐటి కోచింగ్‌లో చేరారు. కోచింగ్ సెంటర్‌కు కూడా బసంత్ తన సోదరుడ్ని భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్లేవాడు. కృష్ణకుమార్ ఐఐటిలో 38వ ర్యాంక్ సాధించగా.. తమ్ముడు బసంత్ 3675వ ర్యాంక్ సాధించాడు. ర్యాంక్‌ల తేడాతో ఇద్దరు సోదరులకు వేర్వేరు కాలేజీల్లో సీట్లు వచ్చాయి. కాలేజీలు వేరైనా మనసులు ఒక్కటే అవ్వటం వల్ల తన సోదరుడే తన పనులన్నీ చేసిపెడతాడని కృష్ణకుమార్ గర్వంగా చెబుతాడు. హాస్టల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి హాస్టల్‌కు భుజాలపై తీసుకువెళతాడు. ఏ సినిమాకు గానీ, షికారుకుగానీ ఇద్దరూ తోడూనీడగా వెళుతుంటారు. రూమ్‌కు భోజనం తీసుకువచ్చి పెడతాడు. అన్న పనులన్నీ చేసి తాను కాలేజీకి వెళ్లిపోతాడు. తమ్ముడు లేకుండా ఆ అన్న ఒక్క నిమిషం కూడా ఉండలేడు. స్కూల్లో చదువుకునే రోజుల్లో బసంత్ రెసిడెన్షియల్ క్యాంప్ కోసం కొన్ని రోజుల పాటు వెళ్లాల్సివస్తే తమ్ముడ్ని చూడలేకుండా అన్న ఉండలేకపోయాడు. తొలిసారే వారికి ఐఐటి సీటు రాలేదు. పట్నంలో ఉండి కుమారులిద్దర్ని చదవించలేక తండ్రి తిరిగి గ్రామానికి రమ్మంటే వారిద్దరూ కూడా ముంబయిలోని గ్యారేజీలో పనిచేసి ఆర్థిక ఇబ్బందులను అధిగమించారు. కృష్ణకుమార్‌కు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి కాలేజీ యాజమాన్యం అతనికి 75శాతం ఫీజు తగ్గించింది. అంతేకాదు స్కాలర్‌షిప్ సైతం మంజూరుచేసింది. బసంత్ ఇంజనీర్ కోర్సు పూర్తయిన తరువాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కృష్ణకుమార్ కంప్యూటర్ ఇంజనీర్‌గా స్థిరపడాలని అభిలషిస్తున్నాడు.