సబ్ ఫీచర్

అర్థం కాని చదువు వ్యర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థంకాని చదువు వ్యర్థం అన్నది సామెత కాదు, అక్షరాలా నిజం. ప్రతి తరగతి గదిలో ఎక్కువ వినవచ్చేటటువంటి పదం 4ఆలోచించండి22అని టీచర్లు అంటారు. ఉపాధ్యాయుడు పదే పదే అనే పదం4ఆలోచించండి2 అంటుంటారు. ఈ పదం వినేవాడు ఏమిచేయాల్నో? స్పష్టంగా అర్థంకాదు. అదే మాదిరిగా ఏ ఉద్దేశంతో ఈ పదం వాడుతున్నాడో ఆ ఉపాధ్యాయుడు కూడా చెప్పలేడు. తరగతి గదిలో అన్నింటికన్నా అస్పష్టంగా ఉన్న పదం22ఆలోచించండి అన్న పదమే. ఆలోచనల్లో ఏ విషయాలు ఇమిడి ఉంటాయో చాలామంది విద్యాశాస్తవ్రేత్తలు చెబుతుంటారు. జ్ఞాన సముపార్జన కోసమని కొందరన్నారు. విశే్లషణ అనే పదానికి మారుగా వాడతారు. కొందరు సమన్వయపరచండని అంటారు. కొందరు ఉన్న విమర్శను చేయండంటారు. కానీ ఆలోచనలు మాత్రం మెదడులో జరిగే ఒక ప్రక్రియ అని మాత్రమే ఒప్పుకుంటారు. ఆ ప్రక్రియ ఫలితం వారు సూచిస్తున్నటువంటి విషయాలు కావొచ్చును. జ్ఞాన సముపార్జన లేకుండా అవగాహన రాదు. జ్ఞానం వల్లేకదా అవగాహన. అంటే జ్ఞాన సముపార్జన అన్నది అవగాహనకన్నా ముందే జరగాలి. అవగాహన జరిగిన తర్వాత దానికి అప్లికేషన్ వస్తుంది. కానీ ఒక క్రమంగా ఒక వరుసలా ఇలాగే జరుగుతుందని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. కొన్నిసార్లు తరగతిలో జ్ఞాన సముపార్జన లేకముందే అవగాహన జరుగవచ్చును. అవగాహన లేకుండానే అప్లికేషన్ రావచ్చును. కొన్నిసార్లు నేను పిల్లలముందు ఒక సమస్య పెడితే చిటుక్కున పిల్లలు దానికి సమాధానం చెప్పారు.
ఈ సమాధానం ఎలా చెప్పగలిగారని అడిగితే మాకు తెలవదు సార్ అన్నారు. అది యాదృచ్ఛికంగానే వచ్చిందని ఆ విద్యార్థి చెబుతాడు. కారణం చెప్పలేరు. ఈ ఫలితాన్ని ఒక ఆలోచనతో వచ్చిందంటామా? కాబట్టి ఒక వరుసలో ఒక క్రమంలో జ్ఞాన సముపార్జన తర్వాత అవగాహన, అవగాహన తర్వాత అప్లికేషన్ వస్తుందని మనం ఇదమిత్థంగా చెప్పలేం. ఒక కవి అకస్మాత్తుగా పద్యం చెబుతాడు.
ఈ పద్యం ఎలా చెప్పగలిగావంటే కారణం చెప్పలేడు.
మనం తరగతి గదిలో చదువుకున్నదంతా ఆలోచనల ఫలితమేనా? అనే అనుమానం వస్తూ వుంటుంది.
ఒక విద్యార్థికి 19 తి 9 ఎంత అని అడిగితే 171 అంటాడు. ఇది ఎట్ల వచ్చిందో చెప్పలేడు. దీనిలో జ్ఞాన సముపార్జన లేదా? లేక అవగాహన లేదా? అని అడిగితే లేదు అనే అంటాం. ఇది కేవలం చిలకపలుకుల తీరుగా పిల్లలు చెబుతారు.
కొన్ని పదాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగిస్తాడు. దాన్ని విద్యార్థి చటుక్కున రిపీట్ చేస్తాడు. అలాంటి విద్యార్థిని ఏకసందాగ్రహి. చాలామంది పౌరోహితులు అర్థం తెలియకుండానే శ్లోకాలు చదివేస్తుంటారు. అది వారి మేధస్సులో జరిగిన ప్రక్రియ కాదు. అది కేవలం ఉపరితలం వరకే ఉంటుంది. దాన్ని కంఠస్థం చేయటం అంటాం. కంఠస్తం చేయటం ఆలోచనల ఫలితం కాదు. పరీక్షలలో సమాచారమే అడిగితే కంఠస్తంచేసి దాన్ని పరీక్షల్లో కక్కితే విద్యార్థికి అవగాహన జరిగినట్లు కాదు.
ఆలోచించటమనేది చాలా క్లిష్టమైనటువంటి మేధస్సుపరంగా జరిగే ప్రక్రియ. మన పాఠశాలల్లో జరిగేది ఉపరితలమైన ప్రక్రియే కానీ లోతైన రసాయన ప్రక్రియ ఫలితంకాదు. విద్యార్థిని ప్రశ్న అడగగానే ఒక్క క్షణంలో సమాధానం ఆశించటమే తప్పు. ఒకవేళ ఆ సమాధానం వచ్చినా అవగాహన ఫలితం కాదు. అందువల్ల మన చదువు అవగాహనా రాహిత్య చదువు.
పరీక్షలు అయిపోగానే భారం తీరినట్లు సంతోషపడతారు. చదువుకు అర్థం ఉండాలంటే అవగాహనుండాలి. దాన్ని మనం అప్లికేషన్ చేసే స్థితి ఉండాలి. ఆ అప్లికేషన్‌నే క్రియేటివ్ థింకింగ్ (ఉత్పత్తిచేసిన జ్ఞానం) అంటాం. పరిశోధనకు క్రియేటివ్ థింకింగ్‌ను తీసుకురావాలి. అనగా జ్ఞాన సముపార్జన అనే పదం చాలా లోతైన పదం. దానికి విద్యార్థికి కొంత సమయమివ్వాలి. అది ఒక రోజు కావొచ్చు. కొన్ని రోజులు కావొచ్చును. ప్రతి చదువుకున్నవాడు కాల్పనిక శక్తిగలవాడు కాదు. చదువనేది గూడార్థాలతో కలిసి ఉన్నది.

- చుక్కా రామయ్య