సబ్ ఫీచర్

నిర్వీర్యమైన పంచాయతీరాజ్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య పరిపాలనలో ఎవరు ఎప్పుడు అధికారంలో వస్తారో చెప్పలేం. అలాగే ఎవరు ఎప్పుడు పతనమైపోతారో ఊహించలేం. అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి 1980వ దశకంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వెలిసింది. ఈ పార్టీకి సర్వస్వము ఎన్‌టి రామారావే. అది ఆయన స్వంత పార్టీ. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం వలన ఆ ప్రభుత్వం కొన్ని తిరుగులేని నిర్ణయాలు తీసుకుని రెవెన్యూ, విద్యాశాఖలను నిర్వీర్యం చేసింది.
దేశవ్యాప్తంగా పంచాయతీలను అమలుచేయడానికి 1950వ దశకంలో కమ్యూనిటీ బ్లాకులు ఏర్పడ్డాయి. వీటిని మన రాష్ట్రంలో పంచాయతీ సమితులుగా వ్యవహరించారు. ఆ విధానాన్ని పూర్తిగా రద్దుచేసి మండల వ్యవస్థ ఏర్పాటుచేశారు. తహశీల్‌దార్ ఆఫీసులను రద్దుచేసి మండల స్థాయి రెవిన్యు అధికారుల ఆఫీసులు ఏర్పడ్డాయి. గ్రామ మునసబు కరణం ఉద్యోగాలు రద్దయినాయి. ఎందుకు వీటిని రద్దు చేసారని ఫ్రశ్నించినపుడు ఆ వ్యవస్థ అవినీతిమయం అయిపోయిందని జవాబు చెప్పబడింది. అవినీతి అంటని శాఖ ఏదైనా ఉందా? గ్రామస్థాయిలో రెవిన్యు పనులు చూడానికి వీఆర్‌ఓలను నియమించారు. వీరికి గ్రామంపై అవగాహన ఉండదు. చాలామంది అక్కడ మకాం వుండరు. ఎప్పుడు వస్తారో తెలియదు. వీరిలో కొందరు లక్షలు ఆర్జించారు. కొందరు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. ఇది అవినీతి కాదుకాబోలు! మండల స్థాయి ఆఫీసు ఉద్యోగులు చాలామంది మండలకేంద్రాల్లో నివశించడంలేదు.
పంచాయతీ రెవిన్యు వ్యవస్థ ....రెవిన్యు, విద్యాశాఖలను యధాతథంగా వుంచింది. విద్యాశాఖ విషయంలో మొదట పొరబడినా అది సరి చేయబడింది. ప్రజల ముంగిట పాలన పంచాయతీరాజ్ వ్యవస్థలో పూర్తిగా అమలు జరిగింది. సమితిలో వ్యవసాయం, పశువైద్యం, విద్య, సహకారం, పరిశ్రమలు, సాంఘిక, స్ర్తి జనాభ్యుదయం, ఇంజనీరింగు, పంచాయతీ, ఫిషరీస్ మొదలైన శాఖల అధికారులుండేవారు. వీరంతా ఆయా గ్రామాల్లో నెలకు ఇరవైరోజులు తక్కువ కాకుండా పర్యటించేవారు. సర్పంచులకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంతో విలువవుండేది. వారు గ్రామ సమస్యలు బ్లాకు అభివృద్ధి అధికార్ల దృష్టికి తెచ్చినపుడు వారు సంబంధిత అధికారులను ఆయా గ్రామాలకు పంపి సమస్యలు పరిష్కరించేవారు. నేటి మండలాలలో ఇంతమంది అధికారులులేరు. అలా నియమించడం సాధ్యం కూడా కాదు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిటిసి అనే ఒక నిష్ప్రయోజనమైన పదవి సృష్టించబడింది. మా విధులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు వీరు. ప్రతి పంచాయతీ సమితిలోను ఒక స్కూళ్ల ఇన్స్‌పెక్టర్ పోస్టు వుండేది. వీరి ఆఫీసు వేరుగా వుండేది. వీరి పని పాఠశాలలను సకాలంలో తనిఖీ చేయడం విద్యా ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకోవడం. సమితి ఆఫీసులో విద్యాశాఖ విస్తరణ అధికారి పోస్టు వుండేది. వీరు ఉపాధ్యాయుల జీతాలు చెల్లించడం బదిలీలు పాఠశాలల నిర్వహణ వంటి పనులు చూసేవారు. మండల వ్యవస్థ ప్రారంభం కాగానే స్కూళ్ల ఇన్స్‌పెక్టర్ పోస్టులు రద్దయినాయి. మండలానికి ఒక విద్యాశాఖాధికారిని నియమించారు. వీరికి పాఠశాలల నిర్వహణ బాధ్యత పూర్తిగా అప్పగించడం వలన పర్యవేక్షణకు తగిన వ్యవధి లేకుండా పోయింది. ఫలితంగా విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి.
ప్రజల ముంగిట పాలన కావాలంటే పంచాయతీ సమితిలను పునరుద్ధరించాలి. మునసబు కరణం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలి. బ్రిటిష్ పాలనలో గ్రామంలో స్థితిమంతులను, పలుకుబడి గలవారిని మునసబులుగా నియమించేవారు. పోలీసు స్టేషన్లకు కోర్టులకు వెళ్లకుండా కొన్ని తగాదాలు వారి కచేరీలో పరిష్కారం అయ్యేవి. వ్యవస్థలో దోషాలు వుంటే వాటిని సరిచేయాలి కానీ మొత్తం వ్యవస్థ రద్దు చేయడం మంచిది కాదు. కానీ ఇపుడు ఈ పనులు ఏవి జరిగేవికావు. స్థానిక స్వపరిపాలన క్రమంగా నిర్వీర్యం అవుతున్నది. జిల్లా పరిషత్తుల, పురపాలక సంఘాల అధికారాలు చాలా వరకు ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. పరిపాలన వికేంద్రీకరణకు బదులు కేంద్రీకరణ విస్తరించిపోతున్నది. ఇది ప్రజాస్వామ్య పరిపాలనా సూత్రాలకు విరుద్ధం.

-వేదుల సత్యనారాయణ