సబ్ ఫీచర్

చదువుపేరుతో శిక్ష తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనె్నం పునె్నం ఎరుగని పాఠశాలల పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో చదువు విషయంలో సక్రమంగా ప్రవర్తించలేదనే నెపంతో పిల్లల పట్ల క్రూరత్వాన్ని చూపుతున్న పాఠశాల ఉపాధ్యాయుల వేధింపులు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. పాఠశాలల్లో శిక్షణకన్నా పిల్లలకు వేసే శిక్షలు పెచ్చరిల్లుతున్నాయని యునిసెఫ్ అధ్యయనం బట్టబయలుచేసింది. వివిధ విద్యా సిఫార్సులు, నిర్దేశాల ప్రకారం బోధన సందర్భంగా పిల్లల్ని భౌతికంగా దండించడం, మానసికంగా వారిని కించపరచడం తగని పని అని హెచ్చరిస్తున్నా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వాటిని బేఖాతరు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఏదోనెపంతో విద్యార్థులను గంటల తరబడి ఎండలో నిలబెట్టడం, గుంజిళ్లు తీయించడం, గోడ కుర్చీలు వేయించడం, వాతలుపెట్టడం, బెత్తాలతో చితకబాదడం, గోడకేసి కొట్టడం వంటి సంఘటనలతో పిల్లలు చదువుకంటే శిక్షలే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు పది పదిహేను కిలోల బరువైన పుస్తకాల్ని వీపున మోస్తున్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
బడిపిల్లల పుస్తకాల బరువును తగ్గించాలని విద్యాహక్కు చట్టం గత ఆరేళ్లుగా నిర్దేశిస్తున్నా పుస్తకాల బరువును తగ్గించకపోగా అదనంగా బడితపూజ దరువుతో పిల్లలు హడలెత్తిపోతున్నారు. ఏయే తరగతుల విద్యార్థులు ఏమేరకు పుస్తకాలు తీసుకుపోవాలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిబిఎస్‌ఈ నిర్దిష్ట ప్రమాణాన్ని మించి పుస్తకాల భారం వుండరాదని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పదే పదే హెచ్చరిస్తున్నా పాఠశాలల యాజమాన్యాలకు చీమకుట్టినట్టయినా లేకపోవడం గర్హించదగ్గ విషయం. విద్యార్థుల పట్ల కఠిన వైఖరికంటే విద్యార్థులు చదువులో ఎలా రాణించాలో తరగతి గది ఉపాధ్యాయులు తగిన సూచనలు అందించాలి. అంతేకానీ పిల్లలను దండించే తరుణంలో తగలరాని చోట బెత్తం తగిలితే అలాంటి పిల్లలు జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతారనే మానవతా దృక్పథం పాఠశాల గురువులలో ఆవిర్భవించాలి. పిల్లలను లేలేత గులాబీ పుష్పాలుగా చూడాలికానీ వాటిని చిదిమేసి ఛిద్రం చేసే మానసిక ప్రవృత్తి అలవాటుపడరాదు.
హ్యూమన్ రైట్స్ నివేదిక దాదాపు 40 సంవత్సరాల పరిశోధనలో వివిధ దేశాలలో విద్యాబోధన ఫీజులు, పాఠశాలల్లో హింసలాంటి విషయాల్ని గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలలకంటె కార్పొరేట్ పాఠశాలల్లోనే విద్యార్థులపై జులుం ఎక్కువగా వుందని విద్యా అధ్యయన కమిటీ గుర్తించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఎంతసేపూ విద్యార్థుల ఉత్తీర్ణతకు వారి మెదళ్లలో పాఠ్యాంశాలను చొప్పించడం తప్పితే ఇతరములైన వాటికి వారు ప్రాధాన్యం ఇవ్వకపోవడం అందుకు ఉదాహరణ. మార్కులు, ర్యాంకులు తప్పితే ఆ ప్రైవేటు విద్యాసంస్థలకు మరో ఆలోచన వుండదు. ఈ విషయంలో కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బడిపిల్లల వయసుకు తగ్గ పాఠ్యాంశాలు, పుస్తకాలను తగిన రీతిలో సంస్కరించింది. విద్యార్థులపై భౌతిక దాడులను 1979లోనే చట్టబద్ధంగా నిషేధించిన దేశం స్వీడన్. ఆ తర్వాత ఫిన్లాండ్, నార్వే, ఆస్ట్రియా తదితర దేశాలు బాలల హక్కులపై, పాఠశాలల్లో వారిపై వివిధ రకాలుగా జరిపే అమానుష చర్యలను తీవ్రంగా ఖండించింది.దేశ దేశాల్లో బాలల హక్కులపైన, విద్యారంగంపైన ఇంత దుమారం రేగుతున్నా పాఠశాలల్లో తమ మాతృభాషలో మాట్లాడినందుకు శిక్షలు, తరగతుల బహిష్కరణ అంతేకాకుండా అలాంటి బాల బాలికలపై కఠినతర శిక్షలు పాఠశాలల్లో అమలవుతున్నాయి. తెలుగు రాష్ట్రంలో పుట్టి మాతృభాషలో మాట్లాడినందుకు ఈ శిక్షలా?

-దాసరి కృష్ణారెడ్డి