సబ్ ఫీచర్

నల్ల కుబేరుల భరతం పట్టడానికి ఇదే తరుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ బ్యాంకుల్లో నల్లధనం లావాదేవీలకు సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని బట్టబయలుచేసిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పనామాలో పేర్కొన్న దాదాపు 500 మంది దాకా భారతీయుల పేర్లు పత్రాలలో ఉండడంతో నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ పత్రాలలో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఉండడం వలన ప్రభుత్వం ఒకింత ఇరుకున పడింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే పెమా (్ఫరిన్ ఎక్ఛేంజ్ మేనేజ్‌మెంటు) చట్టం ఉల్లంఘన క్రింద పలు కేసులు నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లోని ప్రస్తుత మాజీ దేశాధినేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, నేరచరిత్రల అక్రమార్జనను స్విస్ బ్యాంకుల్లో ఉంది. విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం ఏమేరకు ఉందన్న అంశంపై గతంలో భిన్నఅంచనాలు వెలువడ్డాయి. భారతీయ ప్రజాధనాన్ని అక్రమార్కులు విదేశీ బ్యాంకులకు తరలించడం నగ్నసత్యం. దేశంలో అక్రమార్జనతో దోచుకొన్న సొమ్మును తమ తరతరాల వారికి తగినంతగా ఉండాలన్నది వీరి అభిమతం. స్విస్ బ్యాంకుల్లో మరి కొంత భాగం లక్సెంబర్గ్, బెర్ముడా, మలేసియా, మొనాకో, పనామా, హాంకాంగుల్లో ఉన్న బ్యాంకులతోపాటు కరేబియన్ దేశాలకు చెందిన కీమాన్ ఐలాండ్స్, బహమాస్, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, డొమినికా, నేవిస్, కోస్టారికా, బార్భోడోస్ బాంకుల్లో జమవుతోంది. భారతదేశ అక్రమార్జనపరులు ఇలాంటి బ్యాంకుల్లో నల్లడబ్బును దాచడానికి కారణం ఆయా బ్యాంకుల్లో గోప్యతే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాదారుల అనుమతి లేకుండా వారి ఖాతాల సమాచారాల్ని అక్కడ అందించడం నేరం. విశ్వసనీయత, గోపనీయత ఉండడంవలన ప్రపంచ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు, సినీ రంగ ప్రముఖులు ఇతరత్రా అక్రమార్జనపరులు అక్కడి బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించడానికి మొగ్గుచూపుతున్నారు. వీరేకాకుండా అక్రమ ఆయుధ వ్యాపారులు, బడా స్మగ్లర్స్, ఉగ్రవాద సంస్థలకు చెందినవారు స్విస్ బ్యాంకుల్లో తమ నల్లడబ్బును దాచుకొని వారివారి కార్యకలాపాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో, ఖాతా సంఖ్య నంబర్డ్ అకౌంట్ విధానం చాలా ప్రసిద్ధి. అందువల్లనే వీరి లావాదేవీలు ఇతర కార్యకలాపాలకు డబ్బు డ్రాచేసుకోవడం, జమచేయడం వీటిలో కార్యకలాపాలు ఆయా సంఖ్య ఆధారంగా జరుగుతుంది కానీ ఖాతాదారు పేరు మాత్రం బయటకు పొక్కే వీలుండదు. ఖాతా తెరవాలంటే కనీసం లక్ష డాలర్లు ఉండాలి. స్విట్జర్లాండ్ సహా పన్ను రహిత సర్గ్ధామాలుగా పేరొందిన పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు విదేశాలనుంచి పెద్దఎత్తున ఏటా వచ్చిపడుతున్న నల్లధనం అండతో మరింత పటిష్ఠంగా ఎదుగుతున్నాయి. కేవలం 82 లక్షల జనాభా కలిగిన స్విట్జర్లాండ్, ఐరోపా దేశమైన మొనాకో జనాభా కేవలం 37వేలు అత్యధిక తలసరి ఆదాయంతో ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. మొనాకో దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరుడు. అక్కడున్న 20కి పైగా ప్రైవేటు బ్యాంకుల్లో నిరంతరం పోగవుతున్న నల్లధనమే దీనికి కారణం. కరీబియన్ ద్వీపంలో కీమాన్ ఐల్యాండ్ 56వేల జనాభా అయినదైనా అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా ఎదిగింది. ఇంత చిన్న పన్ను రహిత ద్వీపంలో 300కు పైగా బ్యాంకులు లక్షన్నర కోట్ల డాలర్లకు పైగా ఆర్థిక లావాదేవీలు నడుపుతుండడం ఆశ్చర్యకర విషయం. మన దేశంలో సంపన్నులు, నల్లకుబేరులు ఒకవైపు తమ సంపదను విదేశీ బ్యాంకులకు తరలిస్తుంటే, మరోవైపు కరువు కాటకాలు, నిరుద్యోగం, ఆర్థిక లేమి, రైతుల ఆత్మహత్యలతో సామాజిక ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. నల్లధనం వెలికితీతపై గత ప్రభుత్వాలు ప్రగల్భాలు పలికాయి. మోదీ ప్రభుత్వం సైతం నల్లధనం రాబట్టడం ఖాయమని, అందుకు కట్టుబడి ఉన్నామని చెపుతూనే ఉంది. ఏ పనామాపత్రాల ద్వారానో, హెచ్‌ఎస్‌బీసీ కుంభకోణంతోనో లేదా ఇతరత్రా లీకుల రూపంలోనో నల్లకుబేరుల గురించి తెలుసుకోవాల్సి దుస్థితిలో మన దేశం ఉందంటే దేశ నియంత్రణ యంత్రాంగాలు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు ఏమేరకు కర్తవ్య నిర్వహణ గావిస్తున్నాయో ఇట్టే అర్థమైపోతోంది. ఎన్డీయే ప్రభుత్వమైని నల్లధనం వెలికితీతపై భవిష్యత్తులో అక్రమార్కుల ఆగడాల్ని అడ్డుకొనేందుకు నల్లధన చట్టం తీసుకురావడం మనీ లాండరింగ్ చట్టంలో కొన్ని మార్పులుచేయడంతో ప్రభుత్వం నల్లధనంపై ఉక్కుపాదం మోపనుందన్న సంకేతం అందింది. చట్టాలుచేసో స్వచ్ఛంద వెల్లడి పథకాల వల్లనో ఏమాత్రం ప్రయోజనం ఉండబోదు. ఎన్డీయే ప్రభుత్వం నిరుడు ప్రవేశపెట్టిన విదేశీ నల్లధన స్వచ్ఛంద వెల్లడి పథకం సైతం ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ప్రభుత్వం మరింత పకడ్బందీ వ్యూహాలను అనుసరించి, నల్లధన కుబేరులకు వెన్నులో వణుకుపుట్టేటట్లు చట్టాలకు పదునుపెట్టాలి. అంతర్జాతీయంగా పలు అభివృద్ధిచెందిన దేశాలనుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా స్విస్ బ్యాంకులు తమ ఖాతాదారుల సమాచారం ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ అవకాశాన్ని భారత్ సైతం అందిపుచ్చుకొని కృతనిశ్చయంతో ముందుకు సాగాలి.

- దాసరి కృష్ణారెడ్డి