సబ్ ఫీచర్

గులాబీలు విరబూయనీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయలు ఎక్కువగా ఇష్టపడే పూలు గులాబీలు. ప్రేమకు చిహ్నాలు. కేవలం అలంకరణకే పరిమితం కాక గులాబీలు ఆరోగ్య పరిరక్షణలోను, సౌందర్య పోషణలోను, సుగంధ ద్రవ్యంగాను పనిచేస్తాయి. సులభంగా పెంచుకోదగిన మొక్క కనుక ఏ ఇంటి ముంగిలిలో చూసినా రంగు రంగుల గులాబీలు తళుకులతో, సువాసనలు వెదజల్లుతూ ఆహ్లాద పరుస్తూ కనిపిస్తుంటాయి. గుత్తులు గుత్తులుగా చెట్టు నిండుగా అలలారుతూ కన్నుల పండువగా వుంటాయి. అందానికి మారుపేరుగా ప్రపంచమంతా గుర్తించిన దివ్యమైన గులాబీలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి చక్కని ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు.
మొక్కల సంరక్షణ ఇలా?
గులాబీ మొక్కలను కుండీల్లో నాటుకుని బాల్కనీల్లో పెట్టుకుంటే ఇంటికి శోభనిస్తాయి. గులాబీకి ఒక రంగు అంటూ ఉన్నా ఎరుపు, తెలుపు, పసుపు, నీలం- ఇలా నానా రకాల రంగుల్లో గులాబీలు పూస్తాయి. చిన్న చిన్న మొక్కలకే ఎక్కువ పువ్వులు పూయడంవల్ల కుండీలను పైభాగాన 25 30 సెంటీమీటర్ల వ్యాసార్థం కలవి ఎన్నుకోవాలి. కుండీలకు అడుగున నీళ్ళు నిలువ ఉండకుండా కన్నం ఉండాలి. కుండీలలో నుంచి కారిన నీటితో ఇల్లంతా పాడవకుండా ట్రేలను వాడుకోవాలి. కుండీలలో మట్టి నింపేటప్పుడు ఇసుక, రాళ్ళు కలవకుండా జాగ్రత్తపడాలి. కుండీల్లో మట్టితోపాటు కంపోస్టు ఎరువును రెండు, ఒకటి నిష్పత్తిలో గుల్లగా చేసి కలిపి నింపాలి. కుండీలో నీళ్ళు పోయడానికి వీలుగా పైన 5 సెం.మీ వరకు ఖాళీ స్థలాన్ని విధిగా ఉంచాలి. గులాబీ మొక్కను నాటేటప్పుడు మట్టిలోకి ఆకులు, మొగ్గలు కలిసిపోకుండా చూడాలి. మొక్కను నిటారుగా కుండీలోకి దించాక చుట్టూ చేతి వేళ్ళతో మట్టిని నెమ్మదిగా నొక్కాలి. మొక్కను నాటాక రోజూ రెండు పూటలా నీళ్ళు అవసరమైనన్ని పోస్తుండాలి. పువ్వుల దిగుబడికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు బాగా అనుకూలమైనవి. కుండీలలో మట్టి తడి ఆరిపోకుండా, వేడినుంచి తట్టుకునేలా పైన ఒక పొరగా ఆరిపోయిన ఆకులు, ఆవుపేడలను వేసుకోవాలి. ఇవి ఎరువుగానూ పనిచేస్తాయి కూడా. డైమిథోట్, మిథైలైటెడ్ స్పిరిట్ లాంటివి వాడుకోవాలి. వీటిని పెంచడం సరదాగా, చాలా సులువుగా తోస్తుంది. కానీ కాస్త శ్రమపడాలి. వాడిపోయిన ఆకులను, పువ్వులను తుంచడం, కలుపుమొక్కలను తీయడం చేస్తుండాలి. గులాబీ మొక్కలపైన నీళ్ళు స్ప్రే చేయడంవలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణ కలుగుతుంది.

- హర్షిత