సబ్ ఫీచర్

టీవీ ఎక్కువ సేపు చూస్తే మృత్యువుకు చేరువైనట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య కాలంలో పిల్లలు, పెద్దలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ చూడటం మంచిది కాదంటున్నాయి ఆధునిక పరిశోధనలు. రోజులో ఎక్కువ సమయం టీవీ ముందు గడిపితే ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టుకుపోయో అవకాశాలు ఉన్నాయని జపాన్‌లో జరిపిన పరిశోధనలలో వెల్లడైంది. జపాన్ పరిశోధకులు 1988 నుంచి 1990 మధ్యకాలంలో టీవీ చూస్తున్న దాదాపు 86,024 మందిపై పరిశోధనలు చేశారు. వీరంతా 40-79 ఏళ్ల వయసువారు. వీరు రోజులో దాదాపు ఐదు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ ముందు గడిపారు. దాదాపు 59మంది రక్తం గడ్డకట్టటం వల్ల మృతిచెందినట్లు గుర్తించారు. అలాగే 2.5 నుంచి 4.9 గం టలు కంటే ఎక్కువ సమ యం టీవీల ముందు అతుక్కుపోయినవారు 70శాతం, ప్రతిరోజూ రెండు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసేవారు 40 శాతం మంది మృత్యువుకు దగ్గరవుతారని వీరి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.