సబ్ ఫీచర్

మతం పేరుతో రిజర్వేషన్లు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని కోర్టులు చెప్పినా, బీసీలకు ఉద్దేశించబడిన రిజర్వేషన్ల శాతంలో హిందువులకు నాలుగుశాతం తగ్గించి కొన్ని ముస్లిం వర్గాలకు, కులం పేరు తగిలించి, తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే ఉన్నారు. దీన్ని 12 శాతానికి పెంచడానికి రాజ్యాంగాన్ని సవరింపచూస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు, బ్రిటిష్‌పాలకులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కళాశాల ప్రవేశాల్లో,రిజర్వేషన్లు కల్పించారు. అయినా వారు ఎందుకు వెనుకబడే ఉన్నా రు? అధిక సంఖ్యాకులైన హిందువులు చూపుతున్న వివక్ష వల్ల ముస్లింలు వెనుకబడటంలా. పాకిస్తాన్, బంగ్లాలో ముస్లింలు, ఇక్కడివారికన్నా అభివృద్ధి చెందా రా? ఎప్పుడూ పరాయివారి చేత పాలింపబడని దేశం టర్కీ, యూరప్‌కన్నా ముందున్నదా? మతమే అన్నం పెడుతుందా? నిరర్ధక చదువులు, అధిక సంతానం, యోగ్యతలనిస్తాయా? తమ వెనుకబాటులు తామే కారకులు తప్ప మరొకరు కాదు.
ఇఫ్తార్ పార్టీలిచ్చే, హాజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపే హోర్డింగ్‌లు పెట్టే సెక్యులరిస్ట్ నాయకులకు, ఏ ముస్లిం సోదరుడైనా దీపావళికి, దసరాకు, రామనవమికి విందులిచ్చాడా? శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగులు పెట్టారా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. భారత్‌లో ముస్లింలు రాష్టప్రతులయ్యారు, సుప్రీం, హైకోర్టు ముఖ్య న్యాయాధీశులయ్యారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో (హిందూ మెజారిటీ) హోం మంత్రులయ్యారు. ముస్లింలు అల్పసంఖ్యాకులైన అస్సాం, బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ముఖ్యమంత్రులయ్యారు. గవర్నర్లవుతున్నారు. వాయుసేనకు అధిపతులయ్యారు. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులవుతున్నారు. విదేశాంగమంత్రి అయ్యారు. పోలీసు శాఖకు, ఇంటెలిజెన్స్ సంస్థలకు అధిపతులవుతున్నారు. ఇది వివక్షా? 35 శాతం మంది హిందువులున్న జమ్మూ కశ్మీర్‌లో ముస్లిం తప్పితే ఏ హిందువైనా ముఖ్యమంత్రి అయ్యారా?
ప్రజాస్వామ్యంలో, ప్రజల భాష ఉపయోగించబడుతుంది. ప్రజలు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఉద్యోగాలు అర్హతలను బట్టి కాని, మతాన్ని బట్టి ఉండవు. పేదరికం పోవాలంటే పనికివచ్చే భాషలో విద్య నేర్చుకోవాలి. ఉద్యోగార్హతలు కల్పించే విద్య కావాలి. పరిమిత సంతానం ఉండాలి. స్ర్తిలు విద్య నేర్చుకోవాలి. ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకోకుండా ‘సంతానోత్పత్తి మా హక్కు, వారిని పోషించే బాధ్యత మీది’ అంటే ఎట్లా కుదురుతుంది? మదరసాలకు వెళతాం, ఆధునిక విద్య అప్రధానం అయినా ఉద్యోగాలివ్వాలంటారు. రాజ్యాంగంలోని 30వ అధికరణం కింద పరిమితి రాహిత్య మైనారిటీ కాలేజీలు స్థాపించుకున్నా ఇతర కాలేజీల్లో మాకు రిజర్వేషన్ కావాలి, మా జనాభా 10 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. మాకు ఆ దామాషాలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, ఉద్యోగాలివ్వండి, అం టారు. గత ఏడాదివీరి హాజ్ సబ్సిడీ కింద రూ.300 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. మరి అదే హిందువులు తిరుపతి వెళ్లాంటే టిక్కెట్టు కొనుక్కోవలసిందే. పండగలకు స్వగ్రామం వెళ్లాంటే 50 శాతం ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.
ఆరువందల ఏళ్లు పాలించినా బలవంతపు మతమార్పిడులు చేసినా ముస్లింల జనాభా 20 శాతానికి మించలా. అది కూడా వాయువ్య తూర్పు భారతం లోనే. కాని 90 శాతం ఉద్యోగాలు ముస్లింలకే. ఉదాహరణకు నైజాం సంస్థానం చూడండి. 1340 నుంచి 1948 సెప్టెంబరు 17 వరకు వారిదే పాలన. వారి జనాభా పదిశాతం. కాని 90శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వారివే. రాజభాష ఉర్దూ. విద్యాబోధనా మాధ్యమం ఉర్దూ, తెలుగు, మారాఠీ, కన్నడ స్కూళ్లు లేవు. హిందువులు వెట్టికి, వెన్నువిరిగే పన్నులకు గురయ్యారు. ఇన్ని వందల సంవత్సరాలు, ఇంత నిర్దాక్షిణ్యంగా పాలించినవారిని పాలితులు వెనుకబాటుకు గురిచేయగలరా?

సెల్: 9849067359

- డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి