సబ్ ఫీచర్

బెడ్ షీట్స్ మార్చకపోతే ఆస్తమాకు దరిచేరినట్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెడ్ షీట్స్ మార్చకపోతే ఆస్తమాకు మీరు దగ్గరవుతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెడ్ మీద కూర్చొని చాలామంది తినటం, తాగటం చేస్తుంటారు. దీంతో దుమ్మూ ధూళి పురుగులు, మరికొన్ని రకాల బాక్టీరియా, చర్మకణాలు బెడ్ షీట్స్‌ను ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉంటాయి. చాలాకాలం పాటు బెడ్‌షీట్స్‌ను మార్చక పోవటం వల్ల వీటికి అంటుకున్న దుమ్మూ ధూళి పురుగులు, చర్మకణాలు ముక్కులోని శే్లష్మ పొర ద్వారా లోనికి వెళ్లి ఆస్తమాకు దారితీస్తుంది. అంతేకాదు తామర లాంటి చర్మ వ్యాధులు కూడా అంటుకుంటాయి. కాబట్టి వారానికి రెండుసార్లు బెడ్‌షీట్స్ మార్చితే కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. బెడ్‌షీట్స్‌లో పేరుకుపోయిన దుమ్మూ ధూళే బాక్టీరియాకు కమ్మటి భోజనం. రాత్రివేళల్లో వీటిపని సజావుగా నిర్వర్తిస్తుంటాయి. నిద్రలేచిన వెంటనే కనీసం బెడ్‌షీట్స్‌ను చక్కగా ఆరుబయట దులిపి వేసుకోవాలి. దీనివల్ల ఇలాంటి చెడు బాక్టీరియా మళ్లీ ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే పిల్లో కవర్స్‌ను కూడా రెండువారాలకు ఒకసారి మార్చితే మంచిది. ఎందుకంటే చుండ్రు తదితర వాటిని నివారించుకోవటమే కాకుండా దుమ్మూధూళి లేకుండా జుట్టు శుభ్రంగా ఉంటుంది. నాణ్యమైన బెడ్‌షీట్స్ వేసుకోవటం వల్ల పరుపులో ఉండే దుమ్మూ ధూళి, బాక్టీరియా మన శరీరానికి అంటుకోకుండా అడ్డుకుంటుంది. ఇలా వారానిక రెండుసార్లు బెడ్‌షీట్స్, పిల్లో కవర్లు శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టి వేసుకోవాలి. అలర్జీ, చర్మ సంబంధ వ్యాధులు, ఆస్తమా తదితర వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోగలం.
*