సబ్ ఫీచర్

ఉల్లాసంగా..ఉత్సాహంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమంతుడు సినిమా చూశాక చాలామందికి మళ్లీ సైకిల్ తొక్కాలనే ఆశ మొదలైనట్లుంది. అంతకుముందు కూడా చాలామంది వాకింగ్ జాగింగ్‌ల కంటే సైక్లింగ్ బెటర్ అనే దానికి ఓటేసినవాళ్ళూ ఉన్నారు.
మారుతున్న జీవన విధానంవల్ల మనిషికి శారీరక శ్రమ తగ్గి, మానసిక ఒత్తిడి పెరుగుతున్నది. ఆహారానికి తగినట్లు వ్యాయామం లేకపోవడంవల్ల ఒంట్లో కొవ్వు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈనేపథ్యంలో సైక్లింగ్‌తో శరీరంలోని ప్రతి అవయవమూ కదిలి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని బ్రిటీష్ హెల్త్‌కేర్ సంస్థ పరిశోధకులు తేల్చి చెప్పారు. మెరుపు తీగలా సన్నగా కనిపించటానికి వ్యాయమం, యోగాలని ఎంచుకుంటారు చాలామంది. మొదట్లో ఉత్సాహం కొద్దిరోజులకు అది బద్దకించి మానేస్తుంటారు. అలాంటివారు కొత్తదనం కోసం సైక్లింగ్‌ను ఎంచుకోవడంవల్ల వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడంవల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొవ్వు తగ్గి కండరాలు ఉత్తేజితమవుతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న నొప్పులనుంచి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువు శ్వాస సంబంధిత సమస్యలు చాలామటుకు హృద్రోగాలకు కారణమవుతాయి. సైక్లింగ్‌ను ఎంచుకోవటంవల్ల ఈ సమస్య సగానికి సగం తగ్గుతుంది. చర్మవ్యాధులు దరిచేరవు. చర్మ కణాలు ఉత్తేజంగా తయారై చెడు కణాలను బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు ఒత్తిడి కలిగి ఉత్తేజంగా శ్వాసనిచ్ఛ్వాసలు చేయడంవల్ల గాలి గదులు బలంగా తయారవుతాయి. తద్వారా ఊపిరితిత్తులు గుండె పని తీరు మెరుగుగా పనిచేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధులనుంచి 80 శాతం వరకు బయటపడవచ్చునని వైద్యులు చెప్తున్నారు.
సైకిల్ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇదే అవసరం. రాను రాను దీని వాడకం తగ్గిపోతుంది. కేవలం చిన్నారులు మాత్రమే సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దలవరకూ రోజూ సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిత్యం రోడ్లపై వెళ్ళే వాహనాల నుంచి హైడ్రోకార్బన్, నత్రజని, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి వాయువులు వెలువడుతుంటాయి. ఇవన్నీ తీవ్రప్రభావం చూపిస్తాయి. అదే సైకిల్ తొక్కడంవల్ల వాతవారణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు.
చిన్నారుల చేత ప్రతిరోజూ వ్యాయామం చేయించాలంటే చక్కటి మార్గం వారిచేత సైకిల్ తొక్కించడం. సైకిల్ తొక్కటంలో వారు ఆనందం పొందుతారు. ఎదిగే పిల్లలు సైకిల్ తొక్కడంవల్ల వారికి మానసికంగా, శారీరకంగా ఎన్నో లాభాలున్నాయి. సైక్లింగ్ ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే సైకిల్ తొక్కడంవల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అంత స్టాప్ లుక్ అండ్ ప్రొసీడ్‌మీద ధ్యాస అంత ముఖ్యం. స్వతంత్రంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతూ ముందుకు సాగడం పిల్లలకు మహా సరదా. పిల్లలు సైకిల్ తొక్కడంలో భద్రత ప్రధానమని ట్రాఫిక్ నిబంధనలు అన్నీ వర్తిస్తాయని గుర్తించాలి. పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకున్నపుడు పెద్దలు చాలా నేర్పుగా ఉండాలి. వారు సిద్ధం కాకుండానే సైకిల్‌ను నెట్టడం, తోయడం అత్యంత ప్రమాదకరం.
వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలోని హైటెక్ సిటీతోపాటు పలు ప్రాంతాలు సైకిలిస్టులతో నిండిపోతున్నాయి. మారిన తరానికి అనుగుణంగా పలు రకాల లేటెస్టు మోడల్ సైకిళ్లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. వీకెండ్స్‌లో చాలామంది ఐటి ఉద్యోగులు శరీర ఉల్లాసానికి ఆరోగ్యానికి సైక్లింగ్ చేస్తున్నారు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి