సబ్ ఫీచర్

తల్లి పాల వల్లే మెదడుకు పదును...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అనే ప్రకటనకు ఆకర్షితులై ఎంతోమంది తల్లులు తమ పిల్లలు గొప్ప క్రికెట్ ఆటగాడు కావాలని వందల రూపాయలు పోసి బూస్ట్ కొనుగోలు చేసేవారు ఈ దేశంలో కొదవలేదు. వయసు పెరుగుతున్న పిల్లలకు బూస్ట్ ఇవ్వటానికి ఉబలాటపడే తల్లులు పుట్టిన వెంటనే కనీసం నెలరోజుల పాటు తన రొమ్ము పాలు ఇస్తే అదే వారి మెదడు చురుకుదనంగా పనిచేయటానికి బూస్ట్‌గా ఉపయోగపడుతుందనే విషయాన్ని గ్రహించమంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా గడువుకు ముందే పుట్టే పిల్లల విషయంలో ఈ శ్రద్ధ మరింత అవసరం అని నొక్కి వక్కాణిస్తున్నారు. పుట్టిన వెంటనే తల్లి పాలు లభ్యంకాకపోతే పాలను డొనేట్ చేసేవారి నుంచైనా సేకరించి పాలు పట్ట
మని అమెరికాకు చెందిన లూరుూస్ పిల్లల వైద్యులు సింథియా రోగర్స్ తెలియజేస్తున్నారు. మీది పాలు ఇవ్వటం వల్ల పిల్లల మెదడులో చురుకుదనం లోపించినట్లు గ్రహించారు. దీనివల్ల తల్లిపాల ఉత్ప త్తి తగ్గిపోతుంది. బిడ్డ ఎపుడైతే చీకటం తగ్గిన కొద్ది పాల ఉత్పత్తి కూ డా తగ్గిపోతుంది. పుట్టిన గంటలోనే తల్లిపాలు పట్టిన పిల్లల మెదడు స్పందించే తీరును కూడా వైద్యులు అధ్యయనం చేయటం జరిగింది. కాబట్టి ఇంక్యూబేటర్లలో పెట్టిన బిడ్డలకు సైతం తల్లిపాలను పిండి ట్యూబ్ ద్వారానో, చెమ్చా ద్వారానో ఇప్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పడితే ఎక్కువ తయారవుతాయి. మొదటి ఏడు రోజులు పట్టలేదంటే పాలు ఎండిపోయో అవకాశాలు ఉంటాయి. తల్లిపాలు పట్టిన పిల్లలను, తల్లిపాలు పట్టని పిల్లలపై అధ్యయనం చేసిన వీరు ఈ విషయాన్ని ధృవీకరించారు. తల్లిపాలు తాగిన పిల్లల బ్రెయిన్ వాల్యూ మ్స్, ఆలోచనా శక్తిలోనూ మార్పు ఉన్నట్లు గ్రహించినట్లు, ఈ విషయం ఎంఆర్‌ఐ స్కాన్‌లో బయటపడిందని రోగర్స్ తెలియజేస్తున్నారు. 26 వారాల పాటు తల్లి కడుపులోనే ఉండి పుట్టిన పదివారాల బిడ్డలను, 14 వారాలకు ముందే జన్మించిన బిడ్డలపై వీరు ఈ అధ్యయనం చేయటం జరిగింది. తల్లులు ఇది కీలక దశ అని గుర్తించండి మరి. పాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే మీ బిడ్డ మెదడుకు పదును పెట్టలేరు.