సబ్ ఫీచర్

సమాజాన్ని తీర్చిదిద్దే ‘పలకలోని రాత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది ప్రధానంగా మూడు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీనిలో ఏది కొరత ఉన్నా తరగతి గది క్రుంగిపోతుంది. అవి.. 1.బోధన 2.లెర్నింగ్ 3.సామాజిక కార్యక్రమాలు. ఈ మూడు కార్యక్రమాలు తీవ్రమైన మార్పులకు గురవుతున్నాయి. ఒకనాడు ఉపాధ్యాయునికి సుద్దముక్క, మాట్లాడటం (జాక్ అండ్ టాక్) ఉండేది. ఈనాడు బోధనా ప్రక్రియలో ఎన్నో ఉపకరణాలు వచ్చాయి. ఒకప్పుడు ప్రీ డైమన్షన్ లెక్క చెప్పాలంటే తలకిందులయ్యే వాళ్లం. ఇవాళ ప్రతి విద్యార్థి దగ్గర ప్రీడైమన్షన్ చూపించే క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది. టీచరే మాట్లాడటం వెనకటి కాలానికి సంబంధించినది. ఇవాళ ఉపాధ్యాయుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత సమర్థవంతమైన టీచింగ్ అంటున్నారు. గతంలో మంచి విద్యార్థి అంటే నిశ్శబ్దంగా ఉండేవాడని చెప్పేవారు. ఈ రోజు మాట్లాడని విద్యార్థి ఎందుకూ పనికిరాడని అంటున్నారు.
ఈనాడు లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇంతకుముందు తల్లిదండ్రులు బడికి వస్తే ఎందుకొచ్చారని అడిగేవారు. కానీ, ఈ రోజు తల్లిదండ్రులు తరగతి గదిలో భాగస్వాములు కావాలంటున్నారు. తల్లిదండ్రుల ఇంటి పరిస్థితులు కూడా విద్యార్థి చదువును నిర్ణయిస్తారంటున్నారు.
సామాజిక సమస్యలకు, చైతన్యానికి ఆనాడు స్కూల్ కేంద్రం. ఈనాడు ప్రతి మనిషికీ ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉన్నది. రాజకీయాలకు అతీతమైన చదువు చెబితేనే ఆ పాఠశాల నిలదొక్కుకోగలుగుతుంది. చదువుకు రాజకీయ రంగు పులమకూడదు కానీ అన్ని రాజకీయాల గురించి చెప్పాలి. ఏ రాజకీయాన్ని తరగతి గది కౌగిలించుకోకూడదు. కాలగతిలో ఇంత పెద్ద మార్పు వచ్చింది. 21వ శతాబ్దంలో తరగతి గది విద్యార్థుల జీవనోపాధి కోసం కాదు, జీవించటానికే కావాలి. ఈనాడు తరగతి గది నిత్య జీవితంలో సంబంధం కల బోధనతో, సమాజానికి అంకితమయ్యే పౌరులుగా తయారు చేయటానికై, దేశ భవిష్యత్తుకు మొలకలుగా విద్యార్థులు మారాలి. తరగతి గది అంటే గొప్ప మానవ సంపద. తరగతి గది సమాజంలో ఒక భాగం మాత్రమే కాదు- పౌర సమాజాన్ని తీర్చిదిద్దే ‘పలక’.
మార్పుల కల్పవల్లి..
కేజీ స్థాయి పిల్లలు తరగతి గదిలో సున్నితంగా ఆలోచిస్తారు. నాలాంటి వయోవృద్ధునికి ఇప్పటికే కింది తరగతి పిల్లలను చూస్తే- ఆ వయసులో ఆ విధంగా ఆలోచించలేకపోయానే అనే స్థితికి తీసుకువచ్చారు. ఇపుడు ఆ పిల్లలు వేసే ప్రశ్నలు తల్లిదండ్రులను, కొన్నిసార్లు ఉపాధ్యాయులను తికమకపెడుతున్నాయి. వెనుకటి కాలంలో తల్లిదండ్రులు ఏ విగ్రహానికి మొక్కితే పిల్లలు కూడా అలాగే అనుకరించేవారు. ఎవరికి నమస్కారాలు చేయమంటే వారికి నమస్కారాలు చేసేవారు. ఈనాడు ఆరేడు సంవత్సరాల పిల్లవాడు- దేవునికి ఎందుకు మొక్కాలో కారణం చెప్పమని అడుగుతున్నాడు. ఇది తిరుగుబాటు కాదు. మేధోపరమైన పరిణామం ఇది. కథలు చెబితే పిల్లలు సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆటలాడుతున్నపుడు కూడా ప్రాక్టీస్ కన్నా ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఎంత శక్తిని ఏ సమయంలో ఉపయోగించాలి? ఏ దశలో ఉపయోగించాలి? అని తమ కోచ్‌ను అడుగుతున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎంత ప్రధానమో క్రీడాస్థలం కూడా అంతే ముఖ్యమైనది. మార్నింగ్ వాక్ సమయంలో చూస్తే పిల్లలు, కోచ్ కదిలి ఆటలాడుతుంటారు. వెనుకట ఆటలాడి ఇంటికొస్తే తల్లిదండ్రుల నుంచి చివాట్లు తప్పకపోయేవి. ఈనాడు తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించడమే కాదు, పిల్లలను తీసుకుని ఆటలాడించటం, ప్రాక్టీస్ చేయించటం, ఎక్కడైనా క్రీడాపోటీలు జరిగితే వారిని తీసుకుపోతున్నారు. ఆటల గురించి ఇంట్లో చర్చించటం పరిపాటి అయిపోయింది.
సున్నితమైన ఆలోచన, క్రిటికల్ థింకింగ్ సాంప్రదాయమైన తరగతి గదిలోనే కాక క్రీడల్లో, ఆటస్థలాల్లో, ప్రయోగశాలల్లో, గ్రంథాలయాల్లోకి తరగతి వాతావరణం విస్తరించింది. తరగతి గది ప్రస్తుతమున్న అవకాశాలను అందిపుచ్చుకొనేలా విస్తరిస్తున్నది.
నేటి తరగతి గదికి సరిహద్దులు లేవు. అవకాశాలన్నీ అందిపుచ్చుకోవటానికి నేటి విద్యార్థి క్రిటికల్ థింకింగ్‌ను ప్రతి రంగంలో అలవర్చుకోవాలి. ఇంటినుంచి ఆటస్థలం వరకు కూడా శ్రద్ధతో పాల్గొంటుంటే గతకాలం కంటే ఎంత ముందున్నారో ఆలోచించండి. తరగతి గది నిర్వచనమే మారిపోయింది.

-చుక్కా రామయ్య