సబ్ ఫీచర్

‘జాతీయవాదం’.. ఇప్పుడో తప్పుడు పదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి అధునాతన భారతీయ మేధావులకు, తమను తాము ‘స్వేచ్ఛావాదులం’ (జజఇళ్ఘూఒ) అనుకునే వారికి- ‘జాతీయవాదం’ అనేది అర్థరహితమైన ఒక ప్రమాదకారియైన భావం. ముఖ్యంగా కమ్యూనిజం, ఇస్లాం అనేవి ప్రారంభంలో ప్రపంచాన్ని జయించే భావజాలమే సుమా! మన దేశంలో జాతీయవాదానికి పూర్తిగా వ్యతిరేకం- ‘సెక్యులర్ భావన’. దీనిని సరిగ్గా అర్థం చేసుకునేందుకు, మన స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖుల భావాలను ఒక్కసారి గమనిద్దాం.
1905లో బెంగాల్ విభజనకు ప్రయత్నాలు జరిగినప్పుడు- బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం దేశాన్ని ఊపేసింది. అందులో భారతమాతను ‘దుర్గ’ అని,‘లక్ష్మి’ అని వర్ణించినపుడు- ముస్లింల నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ ‘గణేశ్ ఉత్సవాల’ను ప్రారంభించి యావత్ జాతిలో జాతీయభావాలను ప్రేరేపితం చేసినప్పుడూ ఏ వ్యతిరేకతా వ్యక్తం కాలేదు. 1906లో వారణాసిలో ఒక బహిరంగ సభలో తిలక్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ‘్భగవంతుని దయవలన మనం వివిధ వర్గాలను ఒక బలమైన హిందూజాతిగా తీర్చిదిద్దగలగాలి. ఇది ప్రతి హిందువు కోరికా కావాలి’ అని తిలక్ అన్నారు.
అలాగే, నాటి ఇంకో మహానుభావుడు అరవింద ఘోష్ (మహాయోగి అరవిందుడిగా, పుదుచ్చేరి శ్రీ అరవిందాశ్రమ స్థాపకులు ప్రసిద్ధి చెందారు) ఇవే భావాలు వ్యక్తం చేశారు. ఒక సంవత్సర కాలం జైలుశిక్ష అనుభవించి, విడుదలైన తరువాత 1909లో తమ ప్రసంగంలో ఇలా అన్నారు. ‘జాతీయవాదమనేది- ఒక ధోరణి, ఒక మతం, ఒక నమ్మకం కాదు. అది మన సనాతన ధర్మం, అదే మనకు జాతీయవాదం.’ అలాగే ‘వందేమాతరం’లో మనం విశేషంగా అభిమానించే ‘మాత’ అనే పదం మన మాతృభూమిని గుర్తుచేస్తూ ఒక నూతన భావానికి తెరతీస్తుంది. ఈ పదం ద్వారా ఇప్పుడొక నూతన ధోరణి, దేశభక్తి (ఆ్దళ షఖఆ యచి ఔ్ఘఆజ్యఆజఒౄ) ఏర్పడుతుంది’ అన్నారు. తరువాతి కాలంలో మహాయోగి అరవిందులుగా ‘సనాతన ధర్మం’ అనేది ఒక జీవితమే, అది జీవితంలో చూపినంతగా వివరించదగింది కాదు. ఇది మానవ జీవితానికి విముక్తిని చూపే ధర్మం, దానినే ఈ దేశం నమ్ముకుంది’ అన్నారు.
ఇంకో విశేషం- మన నాయకులందరిలో ఆగస్టు 15వ తేదీ జన్మదినంగా కలిగిన ఏకైక నాయకుడు అరవిందులొక్కరే. మరి వారి స్వాతంత్య్రదిన సందేశం- 1947 ఆగస్టు 15న ఏమిటి? దానినిలా ముగించారు (.... ఱఖఆ ఇక త్ద్ఘీఆళ్పళూ ౄళ్ఘశఒ, ఆ్దళ జూజ్పజఒజ్యశ ౄఖఒఆ ఘశజూ తీజ ఆ్య. యూ తీజఆ్ద్యఖఆ జఆ, ఆ్దళ జూళఒఆజశక యచి నిశజూజ్ఘ ౄజదఆ ఇళ ఒళూజ్యఖఒక జౄఔ్ఘజూళజూ ఘశజూ ళ్పళశ ఛిఖఒఆ్ఘఆళజూ. ఱఖఆ ఆ్ద్ఘఆ ౄఖఒఆ శ్యఆ ఇళ. (ఏ విధానం ద్వారా అయినాసరే- ఈ విభజన తప్పక పోవాలి.. పోతుంది కూడా. అది జరగకపోతే, భారతీయ భవిత తీవ్రంగా దెబ్బతినవచ్చు లేదా నిరుత్సాహపడవచ్చు. అది ఏ పరిస్థితులలో జరగకూడదు). దీనికి మనం ఏమందాం? శ్రీ అరవిందులను పాకిస్తాన్‌ను అంతం చేయమనే దురాక్రమణ వాది అనాలా?
మన గత చరిత్రలో ముగ్గురు స్ర్తిలు శాశ్వతంగా నిలుస్తారు. సోదరి నివేదిత, పాండిచేరి మదర్, ఆనిబీ సెంట్. సోదరి నివేదిత స్వామి వివేకానందుల శిష్యురాలు. పాండిచేరి మదర్ మహాయోగి అరవిందుల వారి శిష్యురాలు. డాక్టర్ ఆనిబీసెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ ముగ్గురూ విదేశస్థులే. నాటి నాయకులు వారి జీవితాలనెంత ప్రభావితం చేశారంటే- తమ దేశాలకు, తమ కుటుంబ జీవితాలను త్యాగం చేసి- ఈ భారతభూమినే తమ పుణ్యభూమిగా భావించి, ఇక్కడే శాశ్వతంగా జీవితాలను గడిపి, ఇక్కడే మట్టిలో కలిసిపోయారు. వారితో పోల్చదగ్గవారు నేడు ఎవరు? ఆ ముగ్గురు మహిళలు ఎవరని ఈ కాలపు పిల్లలు నన్నడిగితే, నేనేం చెప్పగలను? నేటి విద్యావిధానంలో వారి పేర్లే వినపడవుగదా! కనీసం స్వామి వివేకానందుల పేరైనా, ఏ పాఠ్యపుస్తకంలోనన్నా నేడు కనపడుతుందా? వినపడుతుందా?

-చాణుక్య